Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీలో ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ఆరోగ్య శ్రీ..! చేతులెత్తేసిన ప్రైవేట్ ?

ఏపీలో ఆరోగ్యశ్రీ(ఎన్టీఆర్ వైద్యసేవ) పథకం అమల్లో భాగంగా చేసిన చికిత్సలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు అందకపోవడం, వాటిపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో స్పెషాలిటీ ఆస్పత్రులు సేవల్ని నిలిపేశాయి. ఆరు రోజులుగా ఈ పథకం కింద చికిత్సలు చేయకపోవడంతో రోగులు సొంత ఖర్చుతో వైద్యం చేయించుకోవాల్సిన పరిస్ధితి ఎదురవుతోంది. అయినా ప్రభుత్వం నుంచి ఆశించిన స్పందన రాకపోవడంతో ఇవాళ స్పెషాలిటీ ఆస్పత్రులు కీలక ప్రకటన విడుదల చేశాయి.

గత 6 రోజులుగా ఆశా (ANDHRA PRADESH SPECIALITY HOSPITALS ASSOCIATION) ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలిపివేశాయని తెలిపారు. ఈ సమ్మె ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులపై రెండు దశాబ్దాలుగా ప్రభుత్వాల ఉదాసీనత కారణంగా చేయాల్సి వస్తోందన్నారు. ఇది పూర్తిగా రాజకీయాలకు అతీతంగా ఆసుపత్రుల నిర్వహణ భారమై , మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతున్న నేపథ్యంలో చేపట్టాల్సి వస్తోందన్నారు. పేద, మధ్యతరగతి పేషంట్ల కు కనీస వైద్య సేవలు పొందే స్థోమత లేని ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ పధకం హాస్పిటల్స్ యాజమాన్యాలు తీసుకోక తప్పని పరిస్థితి ఉందన్నారు. తీసుకున్నాక వయబిలిటి ఉండదని, కనీస మందులు, పరికరాలు తదితర ఖర్చులు సరిపోయేటట్లైనా ప్రస్తుత ప్యాకేజీలు లేవని తేల్చేశారు.

ap speciality hospitals key request to government over Arogya sri scheme

ఈ పథకాన్ని డా.రాజశేఖరరెడ్డి 2007లో ప్రవేశపెట్టారని, తర్వాత ఈ పథకంలో ద్రవ్యోల్బణం ప్రకారం ప్యాకేజ్ ల రేట్ల సవరణలు అతి తక్కువగా జరిగాయన్నారు. ఇదే సమయంలో ఫ్రొసీజర్స్ లో వాడే పరికరాలు, సామాగ్రి ఖర్చు, బ్యాంక్ ఈఎంఐలు వంటి ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. కనీసం 5 కోట్ల పెట్టుబడి లేకుండా చిన్న హాస్పిటల్ కూడా ప్రారంభించలేని విధంగా ఖర్చులు పెరిగాయన్నారు. ఉదాహరణకు ఫిలిప్స్ ఎఫ్ డీ 10 క్యాథ్ లాబ్ 2017లో 2.8 కోట్లుండగా దాని సమాన వెర్షన్ ప్రస్తుతం 4.5 కోట్లుగా ఉందన్నారు. ఇలా ప్రతీ సామాగ్రి ఖర్చు పెరిగిందన్నారు.

అయితే ప్యాకేజ్ లను ద్రవ్యోల్బణాన్ని అనుసరించి సవరించాల్సింది పోయి, సమాజంలో 95% కు పైబడి, సంపన్న వర్గాలకు కూడా ఆరోగ్య శ్రీ కార్డుల పంపిణీ ని ప్రభుత్వాలు చేపట్టాయన్నారు. పేదవాడి ఆరోగ్య సంరక్షణ కోసం ప్రైవేట్ హాస్పిటల్స్ కట్టుబడబట్టే ఇన్ని వేల కోట్ల బకాయిలను భరిస్తూ వచ్చామన్నారు. ఆరోగ్యశ్రీ స్కీం అమలు చేయడానికి ప్రభుత్వం బదులు హాస్పిటల్స్ ఖర్చు పెట్టి, చకోర పక్షుల్లా ఎదురు చూడటం సరిపోతోందని, అనేక సందర్భాల్లో 5 శాతం లాభం కూడా లేదన్నారు.

ap speciality hospitals key request to government over Arogya sri scheme

రాష్ట్రంలో ఒక్కొక్క హాస్పిటల్ మీద 2-5 కోట్ల రుణభారం పడిందని, గవర్నమెంట్ స్కీం అమలు కోసం హాస్పిటల్స్ వాస్తవానికి స్థోమత మించి అప్పులు చేసి నడపాల్సిన పరిస్థితి ఉందన్నారు. స్కీం లో నడపకపోతే మూసేయాల్సిన పరిస్థితి. స్కీంలో నడిపితే అప్పుల బాధ ఉందన్నారు. వాస్తవానికి ఈ స్కీం ప్రభుత్వ హాస్పిటల్స్ కు పరిమితం చేస్తేనే ప్రైవేటు ఆసుపత్రులకు మంచిదని, లేదా ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఆసుపత్రుల మాదిరిగా జీత భత్యాలు ప్రభుత్వమే భరిస్తే ప్రస్తుతం నడుస్తున్న ప్యాకేజీలు సరిపోతాయన్నారు. పేషెంట్లు తమ బాధ అర్థం చేసుకుని తమకు రావాల్సిన బకాయిల కోసం చేస్తున్న సమ్మె కు మద్దతు తెలపాలని కోరారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+