కల్తీ మద్యం కేసులో మరో వికెట్..! సిట్ ఏర్పాటు తర్వాత ఇదే..!
ఏపీలోని అన్నమయ్య జిల్లా మొలకలచెరువులో బయటపడ్డ కల్తీ మద్యం వ్యవహారం చినికి చినికి గాలివానగా మారుతోంది. ఈ కేసులో ఇప్పటికే నిందితులుగా తేలిన ఇద్దరు టీడీపీ నేతల్ని పార్టీ సస్పెండ్ చేసింది. మరోవైపు పోలీసులు వీరితో పాటు మరికొందరిని వరుసగా అరెస్టులు చేస్తున్నారు. ఇంకోవైపు సీఎం చంద్రబాబు నిన్న ఈ కేసులో దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు స్వయంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.
కల్తీ మద్యం కేసులో ఏ22 నిందితుడిగా ఎఫ్ఐఆర్ లో చేర్చిన చైతన్యబాబు అనే వ్యక్తిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. అన్నమయ్య జిల్లాలోని పెద్ద తిప్ప సముద్రం మండలంలోని ఆంధ్రా వైన్స్ లో చైతన్యబాబు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. కల్తీ మద్యం తయారీలో ఇతని పాత్ర కూడా ఉందని నిర్ధారించుకున్న పోలీసులు.. ఇవాళ అరెస్టు చేసి తంబళ్లపల్లె కోర్టులో హాజరుపరిచారు. దీంతో న్యాయమూర్తి చైతన్యబాబుకు రిమాండ్ విధించారు. ఇతనితో కలిపి కల్తీ మద్యం కేసులో అరెస్టు అయిన వారి సంఖ్య 13కు చేరుకుంది.

మరోవైపు కల్తీ మద్యం వ్యవహారంలో షాకింగ్ వాస్తవాలు బయటపడుతున్నాయంటూ నిన్న సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. ముఖ్యంగా ఆఫ్రికాలో కల్తీ మద్యం తయారీ ఎలా చేయాలో నేర్చుకుని వచ్చి మరీ ఇక్కడ తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించడం, అన్నమయ్య జిల్లాతో పాటు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోనూ ఈ ఘటన మూలాలు బయటపడటంతో త్వరలో సిట్ రంగంలోకి దిగబోతోంది.

ఇప్పటికే కల్తీ మద్యం కేసుపై కూటమి ప్రభుత్వం వర్సెస్ వైసీపీగా మాటల యుద్దం కొనసాగుతోంది. కల్తీ మద్యంపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఇవాళ వైసీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కూడా నిర్వహించాయి. మరోవైపు ప్రభుత్వం మాత్రం తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటుంటే వైసీపీ ఈ వ్యవహారాన్ని తమకు పులిమేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో సిట్ ఏర్పాటు కీలకంగా మారింది.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications