AP SSC RESULTS 2022: పదో తరగతి ఫలితాల విడుదల- రిజల్ట్ ఇలా చూసుకోండి...!

ఏపీలో ఈ ఏడాది జరిగిన పదో తరగతి పరీక్షల ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. విజయవాడలో విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాల్ని విడుదల చేశారు. వివిధ కారణాలతో శనివారం విడుదల కావాల్సిన ఫలితాలు విడుదల కాలేదు. దీంతో ఇవాళ విజయవాడలోని గేట్ వే హోటల్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో విద్యామంత్రి బొత్స సత్యనారాయణ వీటిని ప్రకటించారు.

AP SSC Exam RESULTS 2022 released: Heres How You Need To Check The Result

ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు మే నెలలో నిర్వహించారు. ఇందులో 6 లక్షల 15 వేల మంది విద్యార్ధులు పరీక్షలు రాశారు. వీరిలో దాదాపు 90 శాతానికి పైగా ఉత్తీర్ణులు అయ్యారు. ఈసారి గ్రేడ్ల విధానం రద్దు చేయడంతో మార్కులు మాత్రమే ప్రకటిస్తున్నారు. రికార్డుస్దాయిలో నెలరోజుల్లోపే ఫలితాలు ప్రకటించినట్లు విద్యామంత్రి బొత్స తెలిపారు. 4.14 లక్షల మంది విద్యార్ధులు ఉత్తీర్ణులు అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే 67.26 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 78.3 శాతం ఉత్తీర్ణులయ్యారు. అత్యల్పంగా అనంతపురంలో 49.7 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. 71 స్కూళ్లలో ఒక్క విద్యార్ధి కూడా పాస్ కాలేదని తేలింది. బాలురలో 64 శాతం ఉత్తీర్ణత సాధిస్తే బాలికలు 70 శాతం ఉత్తీర్ణులు అయ్యారు. నెల రోజుల్లో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని విద్యామంత్రి తెలిపారు.

AP SSC Exam RESULTS 2022 released: Heres How You Need To Check The Result

ఈసారి పదో తరగతి పరీక్షా ఫలితాలకు మరో ప్రత్యేకత కూడా ఉంది. ప్రభుత్వం తొలిసారి పదో తరగతి పరీక్షా ఫలితాల ర్యాంకులపై టీవీల్లో ప్రకటనలు ఇవ్వకుండా నిషేధం విధించింది. టీవీల్లో ర్యాంకులు ప్రకటిస్తే కనీసం మూడేళ్లు, గరిష్టంగా ఏడేళ్లు జైలుశిక్ష విధిస్తామని హెచ్చరించింది. అలాగే జరిమానాలు కూడా ఉంటాయని తెలిపింది. దీంతో ఫలితాల విడుదల సందర్భంగా టీవీల్లో ర్యాంకుల యాడ్లకు బ్రేక్ పడినట్లయింది. అలాగే ప్రశ్నాపత్రాల లీక్, మాస్ కాపీయింగ్ ఆరోపణలు వచ్చినా ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదు. నిందితులపై కేసులు నమోదుచేసి దర్యాప్తు చేయిస్తున్నా ఫలితాలపై వాటి ప్రభావం పడకుండా చూసింది.దీంతో ఇవాళ ఫలితాలు సజావుగా విడుదలయ్యాయి. ఫలితాల కోసం https://www.results.bse.ap.gov.in/

http://www.results.manabadi.co.in/2022/AP/SSC/Andhra-Pradesh-10th-Class-Exam-AP-SSC-Results-2022-03062022.htm

https://education.sakshi.com/sites/default/files/exam-result/AP-SSC-10th-Class-Results-2022.html

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+