Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీ విద్యార్థులకు ఇక తెలంగాణలో నో ఛాన్స్- మార్గదర్శకాలు..!!

ఏపీ విద్యార్ధులకు ఇక తెలంగాణ కాలేజీల్లో ఇక పోటీ పడే ఛాన్స్ కోల్పోయారు. తెలంగాణ ప్రభు త్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ఏపీ విద్యార్ధుల పైన ప్రభావం పడనుంది. దీని ద్వారా ఇంజనీ రింగ్ సహా ఉన్నత విద్యా కోర్సుల సీట్ల కేటాయింపులో ఏపీ విద్యార్ధులు అవకాశం కోల్పోతున్నారు. స్థానికత అంశంపై ఇప్పటికే నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన సర్కార్, ఆ కమిటీ నివేదిక ఆధా రంగా కోటా కేటాయించినట్టు ఉత్తర్వుల్లో స్పష్టం చేసారు.

తెలంగాణ నిర్ణయంతో
తెలంగాణ లోని వృత్తి విద్యా కోర్సుల కోసం ఏపీ విద్యార్ధులు అవకాశం కోల్పోయినట్లే. తెలంగాణ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఇక నుంచి ఏపీ విద్యార్థులు పోటీ పడే అవకాశాన్ని ప్రభుత్వం తొలగించింది. రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తి అయిన నేపథ్యంలో స్థానికత కోటాను సవరి స్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి 85% సీట్లు తెలంగాణ స్థానిక విద్యార్థులకు రిజర్వ్​డ్​ కోటాగా పేర్కొంది. మరో 15 శాతం అన్ రిజర్వ్​డ్​ కోటాగా పరిగణించింది.

AP Students lost the chance in Telangana Colleges with latest Decision of TG Govt

తాజా మార్పులు
అయితే అన్​ రిజర్వ్​డ్​ కోటాలోని సీట్లకు తెలంగాణలో కనీసం 10 ఏళ్లు నివసిం చినా, రాష్ట్రంలో పన చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, లేదా ఉద్యోగుల భాగ స్వాములు పోటీ పడేందుకు అవకాశం కల్పించింది. స్థానికత అంశంపై ఇప్పటికే నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన సర్కార్, ఆ కమిటీ నివేదిక ఆధారంగా కోటా కేటాయించినట్టు పేర్కొంది. ఇప్పటి వరకు ఆయా వృత్తి విద్యా కోర్సు​లలో 15% ఏపీ విద్యార్థులు పోటీ పడేవారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం, రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ విద్య సంవత్సరం నుంచి స్థానికత అమలుపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

ఇక నో ఛాన్స్
మరోవైపు పలు పీజీ, వృత్తి విద్యా కోర్సులకు సంబంధిం చిన నోటిఫికేషన్స్ సైతం విడుదల చేసారు. కాగా, ఆ నోటిఫికేషన్లకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభంలోపే స్థానికత అంశంపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో, ఇప్పుడు ఏపీ విద్యార్ధులు తెలంగాణలో పోటీ పడే అవకాశం కోల్పోయారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+