Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రపంచ బ్యాంకులో ఏపీ విద్యార్ధులు-అమెరికా టూర్ లో మరో ఘనత.. ! జగన్ ట్వీట్..

అమెరికా పర్యటనలో ఏపీ విద్యార్ధులు మరో ఘనత సాధించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పటికే అమెరికాలో ఐరాస ప్రధాన కార్యాలయానికి వెళ్లిన మన విద్యార్ధులు..ఇప్పుడు వాషింగ్టన్ డీసీలో ఉన్న ప్రపంచ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని సైతం సందర్శించారు. అక్కడ వారికి ఘనస్వాగతం లభించింది. ఐఎంఎఫ్ డిప్యూటీ ఎండీగా ఉన్న భారతీయురాలు గీతా గోపీనాథ్ వీరిని ఆప్యాయంగా స్వాగతించారు. ఈ మేరకు ఆమె చేసిన ట్వీట్ కు సీఎం జగన్ రీట్వీట్ చేసి ధన్యవాదాలు తెలిపారు.

ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల నుంచి ఎంపికైన విద్యార్ధుల బృందం అమెరికాలోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సదస్సులో పాల్గొనేందుకు వెళ్లింది. అనంతరం విద్యార్థుల బృందం వాషింగ్టన్ డీసీలోని ప్రపంచ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని సందర్శించింది. అక్కడ బ్యాంకు ప్రతినిధులతో మాట్లాడుతూ పేదరికం, అసమానతలను తగ్గించేందుకు విద్య అత్యంత శక్తివంతమైన సాధనమని, అందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో విద్యా సంస్కరణలను చేపట్టారని రాష్ట్ర విద్యార్థులు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు వివరించారు.

ap students visit imf headquarters as part of US tour-ys jagan paid thanks deputy md for welcome

రాష్ట్రంలో అమలు చేస్తున్న విద్యా సంస్కరణలు, సీఎం జగన్ సంక్షేమ పథకాల ద్వారా అందిస్తున్న మేలును ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు వారు వివరించారు. ఈ సందర్భంగా ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు కూడా విద్యార్థులు తమదైన శైలిలో సమాధానాలు చెప్పారు. ఏపీ సర్కార్ చేపట్టిన విద్యా సంస్కరణలు సమాజంలో తెచ్చిన మార్పును మన విద్యార్ధులు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు వివరించారు. నాలుగున్నరేళ్లలో ప్రభుత్వ పాఠశాలలు అద్భుతంగా మారాయని, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న తాము ఇవాళ ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంకు వరకు వచ్చామంటే ఈ సంస్కరణల ప్రభావమే అన్నారు. దీనిపై ప్రపంచ బ్యాంక్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న భారతీయురాలు గీతా గోపీనాథ్ విద్యార్ధులతో సెల్ఫీ తీసుకుని మరీ ట్వీట్ చేశారు.

ap students visit imf headquarters as part of US tour-ys jagan paid thanks deputy md for welcome

ఏపీలో పేదరిక నిర్మూ లన, విద్యకు సీఎం వైఎస్ జగన్ ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో దీన్ని బట్టి అర్ధమవుతోందని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులకు విద్యార్ధులు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నాడు-నేడు, మన బడి, పేద పిల్లలు అంతర్జాతీయంగా ఉన్న పోటీని తట్టుకుని ఎదిగేందుకు విద్యకు ఇస్తున్న ప్రాధాన్యం, డిజిటల్ ఎడ్యుకేషన్, టోఫెల్ శిక్షణ, ట్యాబ్స్ పంపిణీ వంటి అంశాలను వివరించారు.

ఈ కార్యక్రమంలో వరల్డ్ బ్యాంకు ప్రతినిధులతో సమావేశంలో ప్రపంచ బ్యాంక్ భారత సీనియర్ అనలిస్ట్ ట్రేసీ విల్లిచౌస్కీ, సీనియర్ ఎడ్యుకేషన్ స్పెషలిస్ట్ లారా గ్రెగొరీ, లీడ్ హెల్త్ స్పెషలిస్ట్ రిఫత్ హసన్, పబ్లిక్ ఎంగేజ్మెంట్ ఆఫీసర్ లిలౌతో పాటు సమగ్రశిక్ష ఎస్పీడీ శ్రీనివాసరావు, కేజీబీవీ కార్యదర్శి మధుసూదన రావు, ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్ పాల్గొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+