బొత్సపై చంద్రబాబు నిర్ణయం ? టీడీపీ స్టేట్ బాస్ షాకింగ్..!

ఏపీలో అధికార టీడీపీ, విపక్ష వైసీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రభుత్వం నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ తాజాగా మండలిలో విపక్ష నేత, వైసీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. తొలిసారి ఆయన ఇలాంటి ఆరోపణలు చేయడంతో ఇందులో వాస్తవం ఎంతనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఘాటుగా స్పందించారు.

వైసీపీ నేత బొత్స సత్యనారాయణకు ఎవరితో ప్రాణహాని ఉందో పల్లా శ్రీనివాస్ తేల్చిచెప్పేశారు. బొత్సకు కూటమి నుంచి ఎలాంటి ప్రాణహాని లేదని పల్లా తెలిపారు. సొంత పార్టీ నుంచే బొత్సకు ప్రాణహాని ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని బొత్స చెప్పుకోలేకపోతున్నారని తెలిపారు. మండలిలో బొత్స కొంత రాణించే ప్రయత్నం చేస్తున్నారని, అందుకే జగన్‌ నుంచి ప్రాణహాని ఉండొచ్చని పల్లా వ్యాఖ్యానించారు. బొత్స రక్షణ కోరితే సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని పల్లా హామీ ఇచ్చారు.

AP TDP President Palla Srinivas Rejects Botsa s Life Threat Claim Points to YS Jagan

విజయనగరం పైడితల్లి జాతరలో తాను కూర్చున వేదిక కుప్పకూలిన వ్యవహారంపై సీరియస్ అయిన వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను అంతమొందించాలనే ఇలాంటి నాసిరకం ఏర్పాట్లు చేసారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం నుంచి తనకు ప్రాణహాని ఉందన్నారు. దీంతో బొత్స సత్యనారాయణ ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. పైడితల్లి జాతరలో తనకు ప్రోటోకాల్ ఉందన్న విషయం మర్చిపోయారా అంటూ ప్రభుత్వం, కూటమి పెద్దలపై, అధికారులపై బొత్స చేసిన విమర్శలు టీడీపీని తాకడంతో దీనికి పల్లా శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+