ఒకేసారి తెలంగాణ, ఏపీ బడ్జెట్ సమావేశాలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో బడ్జెట్ సమావేశాలు ఒకేసారి ప్రారంభం కానున్నాయి. మార్చి 7వ తేదీ నుండి తెలుగు రాష్ట్రాల బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఉదయం తొమ్మిది గంటలకు గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ సమావేశాలు కూడా హైదరాబాదులో జరుగుతున్నాయి. గత సమావేశాలు హైదరాబాదులోనే జరిగాయి. తొలుత తెలంగాణ రాష్ట్ర శీతాకాల సమావేశాలు, ఆ తర్వాత ఏపీ శీతాకాల సమావేశాలు జరిగాయి. ఇఫ్పుడు బడ్జెట్ సమావేశాలు మాత్రం ఒకేసారి జరగనున్నాయి.












Click it and Unblock the Notifications