దేశంలోనే కరోనా టెస్టుల్లో ఏపీ టాప్ ... రికవరీలోనూ రికార్డ్
ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవటమే కాకుండా ర్యాపిడ్ టెస్టులు చెయ్యాలని , మండలాల వారీగా కరోనా టెస్టులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం . ఇక రోజు వారీగా కరోనా నియంత్రణా చర్యలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు తాజా పరిస్థితిని తెలుసుకుని, అధికారులకు తగిన సూచనలు చేస్తున్నారు.ఈ క్రమంలో నేడు జరిగిన సమీక్షలో రాష్ట్రంలో ఇప్పటివరకు మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకువచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 1,91,874 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది.ఇక కరోనా వైరస్ పరీక్షల నిర్వహణలో అధిక సగటు నమోదుతో దేశంలోనే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని పేర్కొన్నారు. గడిచిన 24 గంటల్లో 10,730 టెస్టులు నిర్వహించారు. ఇక 10 లక్షల జనాభాకు 3,593 పరీక్షలతో దేశంలోనే ఏపీ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఏపీలో జరిగినంతగా కరోనా పరీక్షలు మరే ఇతర రాష్ట్రాలలో జరగటం లేదంటే అతిశయోక్తి కాదు.

దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల రేటు 4.02 శాతం నమోదవుతుంటే.. ఏపీలో 1.07 శాతంగా ఉంది.ఇక కరోనా టెస్ట్ లలోనే కాదు రికవరీ రేటు లో కూడా ఆంధ్ర ప్రదేశ్ రికార్డు సృష్టిస్తుంది. రికార్డ్ స్థాయిలో రికవరీ రేటు 51.49 శాతంగా నమోదయ్యింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి నుంచి కోలుకొని 1056 మంది డిశ్చార్జి అయ్యారు. దేశ వ్యాప్తంగా రికవరీ రేటు 31.86 శాతం అయితే ఏపీలో మాత్రం ఏపీలో 51.49 శాతంగా రికవరీ రేటు ఉంది. మరణాల రేటు కూడా దేశీయ సగటు కంటే తక్కువగా ఏపీలో 2.24 శాతంగా నమోదవుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
ఇక సీఎం జగన్ నిత్యం కరోనా వైరస్ కేసుల విషయంలో సమీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే . కరోనా పట్ల తీవ్ర భయాందోళనలను తొలగించాల్సిన అవసరం ఉందని మరో మారు నేడు జరిగిన సమీక్షలో సీఎం స్పష్టం చేశారు. వైరస్ సోకిన వారి పట్ల వివక్ష చూపడం సరి కాదన్నారు. వైరస్ పట్ల భయం, ఆందోళనలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. వైరస్ పట్ల అవగాహన పెంచుకోవడంతోపాటు, చికిత్స చేయించుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications