AP Weather: ఏపీలో రాబోయే మూడు రోజుల్లో ఉరుములుమెరుపులతో కూడిన భారీ వర్షాలు
అమరావతి: గత ఒకటిరెండు రోజులు విరామం తీసుకున్నట్లు కనిపించిన వర్షాలు మరోసారి కురువనున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వరకు గురువారం 'ఉపరితల ద్రోణి' ఏర్పడింది. అది ప్రస్తుతం దక్షిణ బంగాళాఖాతం మధ్యప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం తమిళనాడు తీరప్రాంతాల వరకు.. సగటు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల వరకు విస్తరించి కొనసాగుతుంది.
ఉపరితల ద్రోణి, ఆవర్తనం ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ వివిధ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఉత్తర కోస్తా ఆంధ్ర ,యానాంలలో శుక్ర, శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక
దక్షిణ కోస్తా ఆంధ్రాలో శుక్రవారం ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.

రాయలసీమలో శుక్రవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. శనివారం ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. ఆదివారంనాడు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. చెరువులు నిండు కుండలను తలపిస్తుండగా, వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వరదల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో రహదారులు దెబ్బతిన్నాయి. హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు బెంబేలెత్తించాయి. వరదల్లో కొట్టుకుపోయి ఇద్దరు వ్యక్తులు మరణించారు. నగరంలోని రహదారులు తీవ్రంగా దెబ్బతినడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.












Click it and Unblock the Notifications