షర్మిల కొత్త అస్త్రాలు - ఆ ఓట్ బ్యాంక్ పై గురి, గేమ్ ఛేంజర్..!!
ఏపీ ఎన్నికల రాజకీయం ఉత్కంఠ పెంచుతోంది. ఎన్డీఏ కూటమి వర్సస్ వైసీపీ గా మారిన పోరులో కాంగ్రెస్ కూటమి సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. షర్మిల పీసీసీ పగ్గాలు స్వీకరించిన తరువాత దూకుడు పెంచారు. ప్రతిపక్షాలను కార్నర్ చేస్తున్నా..జగన్ పైన చేస్తున్న విమర్శలు రాజకీయంగా వేడి పెంచుతున్నాయి. వామపక్షాలతో కలిసి ఎన్నికల బరిలోకి దిగుతున్న కాంగ్రెస్ ఏపీలో సంక్షేమ ఓట్ బ్యాంక్ పైన గురి పెట్టింది. కీలక నిర్ణయాలను ప్రకటించింది.
కాంగ్రెస్ నవ గ్యారంటీలు
కాంగ్రెస్ కర్ణాటక, తెలంగాణలో అధికారంలోకి రావటానికి ఆ పార్టీ ప్రకటించిన గ్యారంటీలు ప్రధాన కారణం. ఇదే సమయంలో ఏపీలో జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం అస్త్రంగానే ఆ పార్టీ ఎన్నికల బరిలోకి దిగింది. జగన్ కు పోటీగా చంద్రబాబు సైతం సూపర్ సిక్స్ పేరుతో సంక్షేమ పథకాలను ప్రకటించారు.

దీంతో..ఇప్పుడు కాంగ్రెస్ ఏకంగా 9 గ్యారంటీలతో ఏపీ ఎన్నికల బరిలోకి దిగుతోంది. అందులో భాగంగా తొలి గ్యారంటీగా రాష్టానికి 10 ఏళ్లు ప్రత్యేక హోదా, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్రానికి 10 ఏళ్లు వచ్చేలా చేస్తామని పీసీసీ చీఫ్ షర్మిల వెల్లడించారు. రెండో గ్యారెంటీ: మహిళా మహాలక్ష్మి: ప్రతి పేద మహిళలకు ప్రతి నెల 8,500 ఇస్తామని, ఏడాదికి లక్ష రూపాయలు అవుతుందని షర్మిల వివరించారు.
సంక్షేమ ఓట్ బ్యాంక్ పై గురి
మూడో గ్యారెంటీ గా రైతులకు రుణమాఫీ హామీలో భాగంగా రైతులకు రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. నాలుగవ గ్యారెంటీ గా పెట్టుబడి మీద 50 శాతం లాభంతో కొత్త మద్దతు ధర. అందేలా చర్యలు ఉంటాయని వెల్లడించారు. ఇక, 5వ గ్యారెంటీ గా ఉపాధి హామీ పథకం కింద కూలీలకు కనీస వేతనం రూ. 400 రూపాయలు చేస్తామని పార్టీ హామీగా ప్రకటించింది.
6వ గ్యారెంటీ గా కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో స్పష్టం చేసింది. 7వ గ్యారెంటీగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.25లక్షల ఉద్యోగాల భర్తీ. మొట్టమొదటి సంతకం ఉద్యోగాల భర్తీ మీదే ఉంటుందని ప్రకటన చేసింది. 8వ గ్యారెంటీగా ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి మహిళ పేరు మీద రూ. 5 లక్షలతో పక్కా ఇల్లు అందిస్తామని హామీ ఇచ్చింది.
షర్మిల ఎన్నికల ప్రచారం
ఇక..9వ గ్యారెంటీగా ఇంట్లో ఎంత మంది ఉంటే అందరికీ పెన్షన్. అర్హులైన ప్రతి ఒక్కరికీ 4 వేల పెన్షన్, దివ్యాంగులకు రూ 6 వేలు పెన్షన్ అందిస్తామని ప్రకటించింది. వైసీపీ, టీడీపీ పోటా పోటీ సంక్షేమ హామీలు ఇస్తున్న సమయంలో కాంగ్రెస్ పూర్తిగా సంక్షేమ హామీలతో ప్రజల్లోకి వెళ్తోంది. దీని ద్వారా ఓట్ బ్యాంక్ పెంచుకొనే ప్రయత్నం చేస్తోంది.
ఏప్రిల్ 1న ఏపీలో కాంగ్రెస్ కూటమి నుంచి పోటీ చేసే అభ్యర్దుల తొలి జాబితా ప్రకటించాలని భావిస్తున్నారు. అదే విధంగా వచ్చే వారం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని నిర్ణయించారు. షర్మిల తన ప్రచారంలో ఎవరిని టార్గెట్ చేస్తారు..కాంగ్రెస్ గ్యారంటీలు ఏ పార్టీ పైన ప్రభావం చూపుతాయనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications