షర్మిల రాకతో టచ్ లోకి వైసీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ? పీసీసీ ఛీఫ్ గిడుగు కామెంట్స్
ఏపీ కాంగ్రెస్ లోకి వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఎంట్రీపై పీసీసీ ఛీఫ్ గిడుగు రుద్రరాజు ఇవాళ మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఢిల్లీలో జరిగిన ఏపీ కాంగ్రెస్ నేతల సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ కూడా షర్మిల ఎంట్రీని నిర్ధారించారని ఆయన వెల్లడించారు. అలాగే ఏపీలో వైసీపీ నేతలు తమ పార్టీ నేతలతో టచ్ లోకి రావడం వెనుక కారణం కూడా ఇదేనన్నారు.
ఏపీలో పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు తమతో టచ్ లో ఉన్నారని పదే పదే చెబుతున్న గిడుగు రుద్రరాజు... దీని వెనుక వైఎస్ షర్మిల ఎంట్రీయే కారణమని చెప్పుకొచ్చారు. ఇప్పటికే మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. తన ప్రయాణం షర్మిలతోనే అని తేల్చిచెప్పేసిన నేపథ్యంలో రుద్రరాజు వ్యాఖ్యలకు ప్రాధాన్యం పెరుగుతోంది. ముఖ్యంగా వైఎస్ షర్మిలతో అన్న సీఎం జగన్ రాయబారాల వార్తలు విఫలమైనట్లు జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో గిడుగు వ్యాఖ్యలకు ప్రాముఖ్యత ఏర్పడింది.

ఏప్రిల్ లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో 175 స్థానాల్లోనూ ఇండియా కూటమితో కలిసి తాము పోటీ చేస్తామని పీసీసీ అధ్యక్షుడు గిడుగు తెలిపారు. ఇందులో భాగంగా త్వరలో చేపట్టబోయే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి రాహుల్ గాంధీ, ప్రియాంకతో పాటు కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులు రానున్నారని గిడుగు రుద్రరాజు వెల్లడించారు.దీంతో ఏపీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ భారీ స్కెచ్ తో సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో షర్మిల పార్టీలోకి వస్తే అనంతరం పరిణామాలు వేగంగా మారే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications