ముఖ్యమంత్రా, ఫ్యాక్షన్ లీడరా?: చంద్రబాబుపై రఘవీరా నిప్పులు
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ కరువైందని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం విజయవాడలోని పీసీసీ కార్యాలయంలో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
అనంతరం రఘవీరారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ ఫ్యాక్షన్ లీడర్‌లా వ్వవరిస్తున్నారని మండిపడ్డారు. ఇందుకు కృష్ణా జిల్లా ఎమ్మార్వో వనజాక్షి సంఘటన నిదర్శనమని అన్నారు.

వనజాక్షిని కేసు విత్‌డ్రా చేసుకోమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఫ్యాక్షనిస్ట్ నేత మాదిరిగా బెదిరించారని ఆరోపించారు. మహిళలపై చంద్రబాబు వియ్యంకుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన అనుచితి వ్యాఖ్యలపై కూడా స్పందించారు.
ఎమ్మెల్యే హోదాలో ఉన్న బాలకృష్ణ మహిళలపై అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. చంద్రబాబు మంత్రివర్గంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న రావెల కిశోర్ బాబు తనయుడు నేరుగా ఓ ముస్లిం మహిళను చేయి పట్టిలాగాడని గుర్తు చేశారు. వీటన్నంటిని చూస్తుంటే చంద్రబాబు ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని రఘవీరా రెడ్డి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications