డబ్బులున్నోళ్లు, ఎమ్మెల్యే కావాలనుకునే వాళ్లకు..వైఎస్ షర్మిల ఆఫర్..!

ఏపీలో రాష్ట్ర విభజన తర్వాత కుదైలేన కాంగ్రెస్ పార్టీకి తిరిగి జవసత్వాలు నింపేందుకు ప్రయత్నిస్తున్న పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ ఔత్సాహికులకు బహిరంగ ఆఫర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల మీద గౌరవం ఉన్న వాళ్లు ముందుకు రావాలని ఆమె కోరారు. నాయకత్వం మీద నమ్మకం ఉన్న వాళ్ళు ముందుకు రావాలని సూచించారు. రాజకీయ ఆకాంక్ష ఉన్న వాళ్ళు, భవిష్యత్ లో ఎమ్మెల్యే అవ్వాలని అనుకుంటున్న వాళ్లు ముందుకు రావాలని కోరారు.

అన్ని వనరులు కలిగిన వాళ్ళు ముందుకు రావాలని, అటువంటి వాళ్ళకు ప్లాట్ ఫామ్ కల్పించేందుకు రెడీగా ఉన్నామని షర్మిల తెలిపారు. కాంగ్రెస్ లో కార్యకర్తలు కమిట్ మెంట్ తో కూడిన వాళ్ళని, నిబద్ధతతో కూడిన వాళ్ళని ఆమె తెలిపారు.
పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు జెండాను నెత్తిన మీద పెట్టుకొని మోసిన వాళ్ళు అన్నారు. ప్రతి జిల్లాల్లో వాళ్ల తపన చూస్తే ఎంతో అభిమానం కలిగిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ మీద ప్రజలకు ఎంతో నమ్మకం ఉందని, గ్రౌండ్ లెవల్ లో మంచి నాయకత్వం ఉంటే ఆదరించే ప్రజలు కోట్లలో ఉన్నారని తెలిపారు.

apcc chief ys Sharmila invites people with resources to join congress offers political future

కోట్ల మంది ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్నారని, కాంగ్రెస్ పార్టీ మంచి పార్టీ అని, అధికారంలో ఉంటే మంచి చేస్తుంది అని నమ్మకంగా ఉన్నారని షర్మిల తెలిపారు. ఈ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, ఈ దేశాన్ని నిర్మించింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తుచేశారు. ఎంతో మంది త్యాగాల పునాది కాంగ్రెస్ అన్నారు. సోనియా గాంధీ తన పదవిని త్యాగం చేసి పార్టీని నడిపించిందని, రాహుల్ నేటికి ప్రజల కోసం కోట్లాడుతున్నారని గుర్తుచేశారు. ఇవన్నీ ప్రజలకు నమ్మకం కలిగించే అంశాలన్నారు. ఇవన్నీ ఉన్నా పార్టీ దగ్గర వనరులు లేవన్నారు. వనరులుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ఎదుగుతుందన్నారు.

కాంగ్రెస్ సిద్ధాంతాలను గౌరవించే వాళ్ళు, ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలను కలుపుకొని వెళ్ళే వాళ్ళు,వైఎస్సార్ ఆశయాలను నిలబెట్టే వాళ్లను కాంగ్రెస్ ఆహ్వానిస్తుందన్నారు. చేరికలకు తాను పూచి అన్నారు. తనకు కాంగ్రెస్ అభివృద్ధి ఒక్కటే అజెండా అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో రావాలని, దేశంలో రాహుల్ ప్రధాని అవ్వాలని ఆమె ఆకాంక్షించారు. ఆంధ్రాలో కాంగ్రెస్ అధికారంలో వస్తె విభజన హామీలు అమలు అవుతాయని తెలిపారు.

చివరి నిమిషంలో వచ్చి టికెట్ తీసుకోవడం కరెక్ట్ కాదని, ముందు నుంచే ప్రజా సేవ చేయాల్సిన అవసరం ఉందని షర్మిల తెలిపారు. నాలుగేళ్లలో ప్రజా నాయకుడిగా ఎదిగే అవకాశం ఉందన్నారు. ఇప్పటి నుంచి పోరాటాలు చేస్తేనే ఎన్నికల నాటికి నాయకుడుగా ఎదుగుతారన్నారు. కాబట్టి మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నామన్నారు. ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరని,
రండి..జాయిన్ విత్ మీ అని షర్మిల ఆహ్వానించారు.

ఇది రాజశేఖర్ రెడ్డి ఆశయమని, దేవుడు నిర్ణయించిందని తెలిపారు. అందరం కలిసి చరిత్ర సృష్టిద్దామన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే స్వేచ్ఛ ఉందని, భాష,ప్రాంతం అని విభేదాలు ఉండవని తెలిపారు. ఏ సమస్య వచ్చినా డిల్లీ దాకా చెప్పుకొనే స్వేచ్ఛ ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఫ్రెష్ కాంగ్రెస్ ఉందని, పార్టీ నడపాలి అంటే రిసోర్సెస్ కావాలని తెలిపారు. కాంగ్రెస్ దగ్గర రిసోర్సెస్ మినహా అన్ని ఉన్నాయన్నారు.

apcc chief ys Sharmila invites people with resources to join congress offers political future

ఆంధ్ర రాష్ట్ర విభజన తప్పు కాంగ్రెస్ ది కాదని షర్మిల తెలిపారు. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాష్ట్ర విభజన చేయలేదని,
అందరు ఒప్పుకుంటేనే రాష్ట్రం విభజన జరిగిందని గుర్తుచేశారు. చిన్నమ్మ అని చెప్పి బీజేపీ రాష్ట్ర విభజన కు మద్దతు ఇచ్చిందన్నారు. విభజన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో రాలేదని, ఇది చాలా సాడ్ పార్ట్ అని అన్నారు.అప్పుడే కాంగ్రెస్ మళ్ళీ అధికారంలో వచ్చి ఉంటే విభజన హామీలు నెరవేరి ఉండేవన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉండేదన్నారు. రాజధాని నిర్మాణం అయ్యేదని తెలిపారు.
-

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+