ప్యాలెస్ లో ఉండే పెద్ద చేపను లాగండి, అన్నకు వైఎస్ షర్మిల ఝలక్
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ కు ఆయన సొంత చెల్లెలు, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఊహించని షాక్ ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ గనుల శాఖలో వేలకోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని, ఈ కేసులో చిన్న చేపలను పట్టుకుని తిమింగలాన్ని వదిలేస్తే ఎలా ? అని వైఎస్ షర్మిల చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
చిన్న చేపలను ఆడించే పెద్ద చేపలు ఎక్కడున్నా పట్టుకోవాలని చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్ జీటీ నిబంధనలను తుంగలో తొక్కేసి పలు కంపెనీలకు గనులు, ఇసుక కాంట్రాక్టర్లు కట్టబెట్టాలని వైఎస్ షర్మిల ఆరోపించారు. సుమారు రూ. 2,566 కోట్లు దోపిడీకి పాల్పడిన ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మాజీ ఎండీ వెంకటరెడ్డిని విచారం చేస్తే ఆయన వెనుక ఆడించిన నాయకుల పూర్తి వివరాలను, వాస్తవాలు బయటకు లాగాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.

వెంకటరెడ్డి లాంటి చిన్న చేపల వెనక ఓ పెద్ద తిమింగలం ఉందని, ఆ తిమింగలం ఏదో, దాని పేరు ఏమిటో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అని వైఎస్ షర్మిల వ్యగంగా అన్నారు. ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మాజీ ఎండీ వెంకటరెడ్డి అసలు తీగ లాగితే ఆయన వెనుక ఉన్న డొంకలు మొత్తం కదులుతాయని, ఆ కోణంలో ఏసీబీ దర్యాప్తు అధికారులు దృష్టి పెట్టాలని వైఎస్ షర్మిల చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కేసును ఏసీబీ అధికారులతో కాకుండా సీబీఐతో దర్యాప్తు జరిపించాలని, ఆంధ్రప్రదేశ్ లో సహజ వనరులను కొల్లగొట్టిన వారు ఎవరైనా సరే వారిని కట్టుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. వెంకటరెడ్డి ఓ చిన్న చేపని, ఆయన వెనుక ఉన్న పెద్ద తిమింగలం ఉందని, ఆ తిమింగలం ఏ ప్యాలెస్ లో దాక్కున్నా దానిని బయటకు లాగాలని వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ లో సహజ వనరులను లూటీ చేశారని, ప్రభుత్వ ఖజానాకు రావలసిన సొమ్ము ప్యాలెస్ లోకి వెళ్లిపోయిందని, వైఎస్ షర్మిల గత వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మాజీ ఎండీ వెంకటరెడ్డి అరెస్టు అయిన తర్వాత ఆయన పేరు చెప్పి గత వైసీపీ ప్రభుత్వం పైన, పరోక్షంగా సొంత అన్న జగన్ పైన మొదటిసారి షర్మిల మీడియా ముందు సంచలన ఆరోపణ చేయడం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ఉన్న వెంకటరెడ్డి ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇక్కడికి వచ్చాడు. ఆ తరువాత గత వైసీపీ ప్రభుత్వంలో గనుల శాఖ ఎండీగా పని చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో నియమాలు ఉల్లంఘించి కొన్ని సంస్థలకు ఇసుక కాంట్రాక్టులు కట్టబెట్టిన వెంకటరెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయల నష్టం వచ్చేలా నిర్ణయాలు తీసుకున్నారని ఏసీబీ అధికారులు ఆయన మీద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో వెంకటరెడ్డితో పాటు ఇసుక కాంట్రాక్టు సంస్థ పేర్లు కూడా ఉన్నాయి.












Click it and Unblock the Notifications