బీజేపీని టీడీపీ ప్రశ్నించాలి, ఏప్రిల్‌లో సోనియా సభ:డిగ్గీ
హైదరాబాద్: ఢిల్లీలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు గురువారం సమావేశమయ్యారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ పార్లమెంట్ ఉభయసభల్లో ఒత్తిడి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు ఆయనకు విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నేతలు రఘువీరారెడ్డి, కొప్పుల రాజు, కేవీపీ రామచంద్రరావు తదితరులు మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, సోనియాగాంధీని కలిసి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వ్వవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

సమావేశ అనంతరం దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై బీజేపీ మాటమారుస్తోందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ వెనక్కి తగ్గడంపై తెలుగుదేశం పార్టీ ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీని నిలదీస్తామన్నారు. కాంగ్రెస్ సీఎంలు ఏపీకి ప్రత్యేకహోదాను వ్యతిరేకించడం లేదని స్పష్టం చేశారు.
ఏప్రిల్ నాటికి ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కోటి సంతకాలు పూర్తి చేసి ప్రధాని నరేంద్రమోడీకి సమర్పిస్తామని దిగ్విజయ్ సింగ్ తెలిపారు. ఏప్రిల్‌లో ఏపీలో కాంగ్రెస్ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభలో సోనియా గాంధీ పాల్గొననున్నట్లు తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు పోలవరాన్ని వ్యతిరేకించడం లేదన్న దిగ్విజయ్ సింగ్.... నిర్వాసితులకు ప్యాకేజీని పెంచాలని కోరుతామని చెప్పారు.












Click it and Unblock the Notifications