భూమనకు సీఐడీ షాక్.. ! పరకామణి కేసులో సమన్లు..!

ఏపీలో గత వైసీపీ హయాంలో చోటు చేసుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరకామణి చోరీ కేసు పలు మలువులు తిరుగుతోంది. గతంలో లోకాయుక్తలో రాజీ చేసిన ఈ కేసును కూటమి సర్కార్ తిరిగి విచారణ చేపట్టడం, అలాగే ఈ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న మాజీ విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ తాజాగా తాడిపత్రి రైల్వే ట్రాక్ పై హత్యకు గురికావడం వంటి పరిణామాల నేపథ్యంలో మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పాత్రపై సీఐడీ ఫోకస్ చేస్తోంది.

ఇందులో భాగంగా వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డికి ఇవాళ సీఐడీ సమన్లు పంపింది. పరకామణి చోరీ కేసులో ఇవాళ సాయంత్రం విచారణకు రావాలని సీఐడీ నోటీసుల్లో పేర్కొంది. టీటీడీ పరకామణిలో 920 అమెరికన్ డాలర్లను అందులో పనిచేసే ఉద్యోగి రవికుమార్ చోరీ చేసిన తర్వాత ఈ కేసును భూమన ఛైర్మన్ గా ఉండి రాజీ చేయించారు. దీంతో ఆయన పాత్రను విచారించేందుకు సీఐడీ సిద్దమవుతోంది.

APCID summons former ttd chairman bhumana karunakar reddy in parakamani theft case

పరకామణిలో రవి కుమార్ చోరీ తర్వాత భూమన హయాంలోనే టీటీడీకి ఆయన ఆస్తుల్ని రాయించి లోకాయుక్తలో రాజీ చేయించారు. ఈ వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో హైకోర్టు సమగ్ర విచారణకు ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలోని అధికారుల బృందం ఇవాళ సాయంత్రం 4 గంటలకు పద్మావతి గెస్ట్ హౌస్ లో విచారణకు రావాలని భూమనకు నోటీసులు పంపింది.

APCID summons former ttd chairman bhumana karunakar reddy in parakamani theft case

పరకామణిలో చోరీ, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, మాజీ విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ హత్య వంటి అంశాలపై
డిసెంబర్ 2 లోగా హైకోర్టుకు సీఐడీ నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో భూమన ఇచ్చే వాంగ్మూలం కీలకంగా మారింది. అప్పట్లో ఆయన టీటీడీ ఉద్యోగి రవి కుమార్ పై తిరుపతి పోలీసులు కేసు పెట్టిన తర్వాత రోజే లోకాయుక్తలో ఎలా రాజీ చేయించారన్న దానిపై సీఐడీ వివరాలు రాబట్టనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+