Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎన్నికల వేళ కీలక మలుపు - సీఎం జగన్ ఒన్ మ్యాన్ షో: చంద్రబాబుకు ఛాన్స్ లేకుండా...!!

ఏపీలో ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ కొత్త మలుపు చోటు చేసుకుంది. సీఎం జగన్ సక్సెస్ మంత్ర చంద్రబాబుకు ఛాన్స్ లేకుండా చేస్తోంది.

ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ సీఎం జగన్ సక్సెస్ బాట పట్టారు. ప్రధాన ప్రతిపక్షం ముఖ్య ఆయుధానికి పదును లేకుండా చేసారు. చంద్రబాబు తనకు మాత్రమే సాధ్యం అని చెప్పుకొనే దానికి చేతల్లో జగన్ సమాధానం ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చల్లో నిలిచారు. ఇప్పటి వరకు సంక్షేమానికే ప్రాధాన్యత ఇచ్చిన జగన్ తన సత్తా ఏంటో చాటారు.

తాను సంక్షేమానికి మాత్రమే కాదని..పెట్టుబడులకు బ్రాండ్ అంబాసిడర్ అని చాటారు. పారిశ్రామిక దిగ్గజాలను రప్పించి...ఏపీకి రూ 13 లక్షల కోట్ల పెట్టుబడులను తెప్పించి తన సత్తా చాటారు. ఇప్పుడు ఆ పెట్టుబడులు గ్రౌండ్ చేయటం తమ బాధ్యతగా చాటారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో జగన్ సక్సెస్ ఒన్ మ్యాన్ షో. ఏం చేసారు..ఎలా చేసారు..

అన్ని విమర్శలకు ఒకటే సమాధానంగా

అన్ని విమర్శలకు ఒకటే సమాధానంగా

జగన్ పాలనలో ఏపీకి పెట్టుబడులు రావనేది టీడీపీ తో సహా ప్రతిపక్షాలు చేసే విమర్శ. సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్న జగన్ అభివృద్ధిని పూర్తిగా విస్మరించారంటూ విమర్శలు చేసారు. అయితే, జగన్ తాను సంక్షేమం మాత్రమే కాదు.. అభివృద్ధి లోనూ తన మార్క్ ఏంటో చూపించే ప్రయత్నం చేసారు. ఊహించని విధంగా ప్రముఖ పారిశ్రామిక వేత్తలను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చారు.

వారితో జగన్ సన్నిహితంగా మెలిగిన తీరు ప్రత్యేకార్షణగా మారింది. ఏ పెట్టుబడి దారుల సదస్సు కు హాజరు కాని అంబానీ రావటం.. జగన్ ను ప్రశంసించటం..స్వయంగా ఏపీలో పెట్టుబడులు ప్రకటించటం మరో ప్రత్యేకత. సాధారణంగా ఎప్పడూ పారిశ్రామిక వేత్తలతో కలిసినట్లుగా కనిపించని సీఎం జగన్..విశాఖ సదస్సులో వారితో సన్నిహితంగా మెలిగారు.

ఏకంగా 13 లక్షల కోట్లు పెట్టుబడుల ఎంఓయూలు జరిగాయి. దీంతో..ఇప్పటి వరకు తన మీద ఉన్న అభిప్రాయాలకు..విమర్శలకు జగన్ ఒక్క సదస్సుతో సమాధానం ఇచ్చారు.

ఒన్ మ్యాన్ షో..పక్కా వ్యూహాత్మకంగా

ఒన్ మ్యాన్ షో..పక్కా వ్యూహాత్మకంగా

విశాఖ పెట్టుబడి దారుల సదస్సులో సీఎం జగన్ ఒన్ మ్యాన్ షో. ప్రభుత్వంలోని మంత్రులు సైతం రెండు లక్షల కోట్టు పెట్టుబడులు వస్తాయని సదస్సు ప్రారంభం వరకూ చెబుతూ వచ్చారు. ముఖ్యమంత్రి స్వయంగా సదస్సులో ప్రకటించే వరకూ ఏకంగా రూ 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు బయటకు తెలియదు. ముఖేష్ అంబానీ..కరణ్ ఆదానీ..జీఎమ్మార్..జిందాల్..బిర్లా వంటి వారి సమక్షంలో సీఎం జగన్ ఈ పెట్టుబడుల అంశాన్ని ప్రకటించారు.

తొలి నుంచి సదస్సు కోసం జగన్ పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తానే పారిశ్రామిక దగ్గజాలతో మాట్లాడారు. పెట్టుబడులకు ఒప్పించారు. అంబానీ సహా ప్రముఖు లు తరలి వచ్చేలా వ్యవహరించారు. ఎక్కడా రాజకీయ అంశాలకు ప్రాధాన్యత లేకుండా.. ప్రచారానికి దూరంగా నిలిచారు. తన సామర్ధ్యం ఏంటో విశాఖ సదస్సు ద్వారా అర్దమయ్యేలా చేసారు. జగన్ లో కొత్త కోణం ఈ సదస్సు వేళ ఆవిష్కారం అయింది. ఈ సదస్సు సక్సెస్ జగన్ ఒన్ మ్యాన్ షో అంటూ మంత్రులు అభినందిస్తున్నారు. వైసీపీ నేతల్లో సదస్సు సక్సెస్ కొత్త జోష్ నింపింది.

చంద్రబాబు కు ఛాన్స్ లేకుండా చేసేలా

చంద్రబాబు కు ఛాన్స్ లేకుండా చేసేలా

ఏపీలో అభివృద్ధి ..పెట్టుబడులు చంద్రబాబుకు మాత్రమే సాధ్యమనేలా ఇప్పటి వరకు ప్రచారం ఉంది. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత పెట్టుబడులు వచ్చినా పెద్దగా ప్రచారం లభించ లేదు. సంక్షేమం మాత్రమే అమలు చేస్తున్న జగన్ కు అభివృద్ధి సాధ్యపడదని టీడీపీ ప్రచారాస్త్రంగా మలచుకుంది.

వచ్చే ఎన్నికల్లో తిరిగి టీడీపీ గెలిస్తేనే ఏపీలో అభివృద్ధి ..పెట్టుబడులు అని ప్రచారం ప్రారంభించిది. సరిగ్గా ఇదే సమయంలో జగన్ సమయం చూసి టీడీపీ ప్రచారానికి సదస్సు తో సమాధానం ఇచ్చారు. సదస్సులో పారిశ్రామి వేత్తలు జగన్ తో సన్నిహితంగా వ్యవహరించటం.. పెట్టుబడులు ఈ స్థాయిలో రావటంతో జగన్ పైన సందేహాలు తొలిగిపోయాయి. ఏ ప్రభుత్వంలో ఒప్పందాలు జరిగినా వందకు వంద శాతం అవి అమలు కావు.

చంద్రబాబు సీఎం గా ఉన్న సమయంలో విశాఖలో జరిగిన పెట్టుబడి దారుల సదస్సు లో రూ 10.50 లక్షల కోట్ల ఎంఓయూలు జరిగాయి. ఇప్పుడు జగన్ హయాంలో రూ 13.05 లక్షల కోట్ల మేర ఒప్పందాలు చేసుకున్నారు. దీంతో..ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ రాజకీయంగానూ ఇది కీలక మలుపు గా మారుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+