వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎపిఎన్జీవో సమ్మె: హైకోర్టు బెంచ్ భిన్నాభిప్రాయాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

APNGOs strike: Different judgemet from Court
హైదరాబాద్: ఎపిఎన్జీవోల సభపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ద్విసభ్య బెంచ్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది. ఎపిఎన్జీవోల సభపై బుధవారం హైకోర్టు తీర్పు చెప్పింది. అయితే ద్విసభ్య బెంచ్‌లోని ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరుగా చెప్పడంతో తీర్పు అస్పష్టంగా ఉంది. దీంతో త్రిసభ్య బెంచ్‌కు దీనిని అప్పగించారు.

ఎపిఎన్జీవోల సమ్మె చట్టవిరుద్దమని వేసింది ప్రజాప్రయోజన వ్యాజ్యమేనని ప్రధాన న్యాయముర్తి చెప్పారు. సమ్మె చట్ట విరుద్ధం వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు. అయితే సమ్మెపై వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం చెల్లదని మరో న్యాయమూర్తి భాను చెప్పారు. పిటిషన్‌దారు గతంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని చెప్పారు.

కాగా, ఎపిఎన్జీవోల సమ్మెపై ద్విసభ్య బెంచ్ నుండి విరుద్ధంగా తీర్పు రావడంతో దానిని త్రిసభ్య బెంచ్‌కు అప్పగించారు. మరో న్యాయమూర్తి ఎపిఎన్జీవోల సమ్మెపై తీర్పు చెప్పనున్నారు. ఇది ఉత్కంఠగా మారింది.

కాగా, రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎపిఎన్జీవోలు ఇటీవల సమ్మె చేసిన విషయం తెలిసిందే. వారు పద్దెనిమిది రోజుల పాటు సమ్మె చేశారు. ఈ సమ్మె చట్టవిరుద్ధమని ఓ న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈ రోజు తీర్పు వెలువడింది.

English summary
Bench of High Court of Andhra Pradesh on wednesday gave judgement on APNGOs strike.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X