APPSC Group 1 Exam: గ్రూప్ 1 పరీక్షలపై హైకోర్టు సంచలనం ..! సిట్ విచారణ..!

ఏపీలో ఏపీపీఎస్సీ (appsc) గ్రూప్ 1 పరీక్షలు రాసిన అభ్యర్ధులకు ఇవాళ భారీ షాక్ తగిలింది. గ్రూప్ 1 పరీక్షల మూల్యాంకలనంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తూ పలువురు అభ్యర్దులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం ఇవాళ సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ పరీక్షల్లో అక్రమాలకు కారణమైనట్లు భావిస్తున్న మూల్యాంకనం విషయంలో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.

గ్రూప్ 1 పరీక్షపై హైకోర్టులో పిటిషన్లు (APPSC)

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షల మూల్యాంకనంలో జరిగిన అక్రమాలపై పలువురు అభ్యర్దులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు.. అదనపు డీజీ స్దాయి అధికారితో సిట్ ఏర్పాటు చేసి వీటిపై దర్యాప్తు చేయించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అలాగే మార్చి 16లోపు ఈ దర్యాప్తు పూర్తి చేసి నివేదికను హైకోర్టుకు అందజేయాలని పేర్కొంది. అలాగే ఈ కేసు దర్యాప్తులో ఏపీకి చెందిన వారు కాకుండా బయట రాష్ట్రాల ఫోరెన్సిక్ నిపుణుల సాయం తీసుకోవాలని ఆదేశించింది.

APPSC Group 1 Exam Irregularities High Court orders SIT Investigation

జవాబు పత్రాలపై ఫోరెన్సిక్ దర్యాప్తు

మరోవైపు అభ్యర్ధులు రాసిన గ్రూప్ 1 జవాబు పత్రాల మూల్యాంకనంపై ఫిర్యాదుల నేపథ్యంలో వీటిని జాగ్రత్తగా ఉంచారా లేదా అని ఏపీపీఎస్సీని ప్రశ్నించింది. ఈ జవాబు పత్రాల భద్రతను నిర్దారించాలని ఆదేశాలు ఇచ్చింది. అలాగే వీటిని తారుమారు చేశారా లేదా అనే విషయాన్ని ఫోరెన్సిక్ దర్యాప్తు ద్వారా నిర్ధారించాలని సూచించింది. దీంతో ఇప్పుడు ప్రభుత్వం ఈ వ్యవహారంపై సిట్ ఏర్పాటు చేసి ఫోరెన్సిక్ సాయంతో జవాబు పత్రాల మార్ఫింగ్ ను నిర్ధారించాల్సి ఉంది. లేకపోతే ఈ పిటిషన్లు నిలబడే అవకాశం లేదు.

మరోవైపు ఎంపికైన అభ్యర్థులందరి సమాధాన పత్రాలు చెక్కుచెదరకుండా ఉన్నాయా, ఏదైనా రూపంలో ట్యాంపరింగ్ జరిగిందా అనేది సిట్ పరిశీలించాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే విజయవాడలో భౌతిక మూల్యాంకనం సమయంలో వాడిన పత్రాలపై ఉన్న బార్‌కోడ్‌లు, ఒరిజినల్ ఓఎంఆర్ షీట్‌లు, బార్‌కోడ్‌ల నుండి పొందిన డేటా ఎంపికైన అభ్యర్థులకు ఒకేలా ఉన్నాయా లేదా అనేది చూడాలి. ఎంపికైన అభ్యర్థుల సమాధాన పత్రాలు, రిట్ పిటిషన్లలో పార్టీలుగా ఉన్న ఎంపిక కాని అభ్యర్థుల సమాధాన పత్రాల మూల్యాంకనం ఒకే పద్ధతిలో జరిగిందా లేదా తేల్చాలి. అలాగే మొదటి 100 లోపు ర్యాంకులు వచ్చిన అభ్యర్థుల సమాధాన పత్రాలు, మెరిట్ జాబితాలోని చివరి అభ్యర్ధి తరువాత తక్కువ ర్యాంకును కలిగి ఉన్న అభ్యర్ధుల సమాధాన పత్రాల మూల్యాంకనం ఒకే పద్ధతిలో జరిగిందా అనేది కూడా చూడాలని ఆదేశించింది. అలాగే తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎంపికైన అభ్యర్థులందరినీ నాన్-ఫోకల్ పోస్టుల్లో నియమించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+