APPSC : ఆగస్టులో 1184 పోస్టులకు నోటిఫికేషన్, గ్రూప్ 1కు మాత్రమే ఇంటర్వ్యూలు
ఏపీపీఎస్సీ నిరుద్యోగులకు శుభవార్త అందించింది. ఏపీలో 1184 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. అందులోనూ ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేస్తామని ప్రకటించింది. గత ఏడాదిన్నర కాలంలో 32 నోటిఫికేషన్ల ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు కమిషన్ సభ్యుడు సలీం తెలిపారు.
గత ఏడాదిన్నర కాలంలో ఇచ్చిన 32 నోటిఫికేషన్లలో గ్రూప్ వన్, పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టుల భర్తీ కోర్టులో పెండింగ్ లో ఉన్నాయని కమిషన్ సభ్యులు సలీం తెలిపారు. ఏపీపీఎస్సీ గత ఏడాదిన్నర కాలంగా పారదర్శకంగా వ్యవహరిస్తోందన్నారు.
ఇకపై ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షల కు ప్రిలిమ్స్ రద్దు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. గ్రూప్ వన్ పోస్ట్ లకు మాత్రమే ప్రిలిమ్స్ నిర్ర్వహిస్తామన్నారు. ప్రిలిమ్స్ పరీక్ష రద్దుకు సంబంధించి జీఓ లు 39, 150 లను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు కమిషన్ సభ్యుడు సలీం పేర్కొన్నారు.

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను ఆగస్టు నుంచి అమలు చేస్తామని ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఆగస్టులో కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తామని, అందులో రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని తెలిపింది. 39 జీవోకు అదనంగా 1184 పోస్ట్ లకు నోటిఫికేషన్ ఇస్తామని కమిషన్ సభ్యుడు సలీం తెలిపారు. వయోపరిమితి సడలింపుకు సంబంధించి ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు వయోపరిమితి 47 ఏళ్లకు పెంచాలని నిరుద్యోగులు కోరుతున్నట్లు సలీం పేర్కొన్నారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications