వాసుదేవ రెడ్డి రిలీవ్ వెనుక- మద్యం స్కాం విచారణ వేళ..!!

ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మద్యం స్కాం విచారణ వేళ అనేక ఆసక్తి కర అంశాలు తెర మీదకు వస్తున్నాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా .. కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో కీలకంగా వినిపిస్తున్న కసరెడ్డి సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. కాగా, మద్యం స్కాంలో ప్రధాన నింది తొడిగా ప్రచారం జరిగిన రాష్ట్ర బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని రాష్ట్రప్రభుత్వం రిలీవ్ చేసింది. ఇప్పుడు ఈ నిర్ణయం ఆసక్తి కరంగా మారుతోంది.

ప్రభుత్వ ఉత్తర్వులు
మద్యం స్కాం విచారణ వేళ ఆ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న రాష్ట్ర బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని రాష్ట్రప్రభుత్వం తన మాతృశాఖయిన రైల్వే శాఖకు తిప్పి పంపింది. ఆయన్ను తక్షణమే రిలీవ్‌ చేస్తున్నట్లు పేర్కొంటూ ఉత్తర్వులు జారీచేశారు. జగన్‌ సీఎం అయిన తరువాత 2019లో ఆగస్టులో వాసుదేవరెడ్డి రైల్వే శాఖ నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్‌పై వచ్చారు. గత ఏడాది ఆగస్టులో ఆయన డిప్యుటేషన్‌ కాలపరిమితి ముగిసింది. కానీ ఆయనపై మద్యం అక్రమాల ఆరోపణలు రావడంతో రాష్ట్రప్రభుత్వం రిలీవ్‌ చేయలేదు. ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు రైల్వే శాఖ ఆయన డిప్యుటేషన్‌ను ఈ ఏడాది ఫిబ్రవరి 25 వరకు పొడిగించింది. ఆ గడువు కూడా ముగియడంతో రాష్ట్రప్రభుత్వం ఆయన్ను తిరిగి మాతృశాఖకు పంపుతూ నిర్ణయించింది.

apsbcl-former-md-vasudeva-reddy-relieved-from-state-govt-details-here

విచారణ వేళ
మద్యం స్కాం విచారణ సమయంలో వాసుదేవ రెడ్డి పలు కీలక అంశాలు వెల్లడించినట్లు కూటమి లో ప్రచారం జరిగింది. మద్యం కుంభకోణంలో పాత్రధారి వాసుదేవ రెడ్డి అని నిర్ధారణకు సీఐడీ అధికారులు వచ్చారు. డిస్టిలరీల నుంచి మద్యం కొనుగోలు, ధరలు నిర్ధారణ వంటి అంశాల్లో వాసు దేవ రెడ్డిది కీలకపాత్ర ఉందని అధికారులు స్పష్టం చేశారు. కమీషన్లు కోసం ధరలు పెంచారని కొంతమంది అధికారులు చెబుతున్నారు. ఆ కమీషన్లు నేరుగా వైసీపీ పెద్దలకు అందాయని సీఐడీ అధికారుల విచారణలో తేలినట్లు సమాచారం. ఎన్నికల సమయంలో ఈసీ వేటు వేసింది. ఎన్నిక ల సంబంధిత విధుల్లో నియమించవద్దని స్పష్టం చేసింది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మద్యం ఆరోపణల పై విచారణ ఎదుర్కొన్నారు.

Take a Poll

రిలీవ్ చేయటంతో
మద్యం కేసులో వైసీపీ ముఖ్యలు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. వైసీపీ మాజీ ముఖ్య నేత సాయిరెడ్డి సైతం ఈ కేసులో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అంతా కర్మ, కర్త, క్రియగా పేర్కొన్నారు. కాగా, తాజాగా ఎంపీ మిథున్ రెడ్డి ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. మిథున్ ను నిందితుడుగా చేర్చలేదనే వాదనలతో ముందస్తు బెయిల్ పిటీషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఇక, కసిరెడ్డి సైతం తాజాగా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. ఈ సమయంలో ఇప్పుడు వాసుదేవ రెడ్డిని రిలీవ్ చేయటంతో రానున్న రోజుల్లో ఈ కేసు లో చోటు చేసుకునే పరిణామాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+