ఏపీ వాసులకు హెచ్చరిక - జాగ్రత్తగా ఉండాల్సిందే..!!
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకు భానుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. ఎండ తీవ్రత కొనసాగడంతో పాటు వడగాడ్పులు వీచాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. అనేకచోట్ల 40 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు రికార్డు అవుతుండటంతో బెంబేలెత్తుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు రికార్డుస్థాయిలో పెరిగిపోతున్నాయి. విజయవాడ, విశాఖ సహా పలు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రెండు రోజుల పాటు అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ ప్రకటించింది.
రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పాటుగా వడగాడ్పులు తీవ్రత ఎక్కువగా ఉంది. తిరుపతి జిల్లా వడమాలపేటలో గరిష్ఠంగా 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ రోజు కూడా పలుచోట్ల వడగాడ్పులు వీస్తాయని, పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు అధికంగా నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు పడనున్నాయి. ఈనెల 22 నుంచి కోస్తా, రాయలసీమల్లో వర్షాలు స్వల్పంగా పెరగనున్నాయి. దక్షిణ మధ్య మహారాష్ట్ర నుంచి దక్షిణ తమిళనాడు వరకు కొనసాగుతున్న ద్రోణి కారణంగా రానున్న 48 గంటలు రాష్ట్రంలో వడగాలుల ప్రభావం తగ్గనుందని, రెండు రోజుల పాటు అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

రాష్ట్రంలో వడగాల్పుల తీవ్రత పెరుగుతోంది. 24 వరకు కోస్తాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ఇస్రో వెల్లడించింది. తెలంగాణలో ఉదయం సమయంలో భారీగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న సమయంలోనే రాత్రి సమయాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. నిర్మల్, ఖమ్మం, జగిత్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లోని పలు మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో మరో మూడ్రోజుల పాటు సాధారణం కన్నా 3 డిగ్రీల వరకు అధికంగా ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. మే నెలల్లో 44 నుంచి 46 డిగ్రీలకు పెరగవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఏపీలో ఉత్తారాంధ్రతో పాటుగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోనూ వడగాల్పుల తీవ్రత ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications