భారీ వర్షాలు, పిడుగులు, ఈదురు గాలులు - బీ అలర్ట్.. ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!!

వాతావరణంలో ఒక్క సారిగా మార్పు వచ్చింది. విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకున్నాయి. ద్రోణి ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో మారుతున్న వాతావరణం పై విపత్తుల నిర్వహణ శాఖ తాజా హెచ్చరికలు చేసింది. ఏపీలోని పలు జిల్లాలకు పిడుగుపాటుహెచ్చరిక చేసింది. భారీగా ఈదురు గాటులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. అదే సమయంలో వర్షాలు కురస్తాయని వెల్లడించింది. రెండు రోజుల పాటుగా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఏపీలో వాతావరణం మారింది. ద్రోణి ప్రభావం కారణంగా పలు ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో రాగల మూడు గంటల్లో ప్రకాశం, మార్కాపురం, నంద్యాల,చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. 40-60కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని అప్రమత్తం చేసింది. రాయలసీమ మరియు దాని పరిసర ప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం కారణంగా రానున్న రెండు రోజుల పాటు వాతావరణంలో మార్పులు సంభవించనున్నాయని అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో ముఖ్యంగా నేటి నుంచి రెండు రోజుల పాటు విజయనగరం, పార్వతీపురం మన్యం, మరియు పోలవరం పరిసర జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.

apsdma-latest-alerts-for-coastal-north-andhra-area-over-rains-for-next-two-days-here-the-detail

ఈ జిల్లాలకు తాజా అలర్ట్స్

వాతావరణంలో ఏర్పడుతున్న ఈ అనిశ్చితి వల్ల గాలి వేగం పెరగడంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తీరప్రాంత మరియు ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా ఆకస్మికంగా ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్న సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండటం ప్రమాదకరమని తెలిపారు. పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉన్నందున పొలాలు, చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల సమీపంలో తలదాచుకోవద్దని సూచించారు. రైతులు, గొర్రెల కాపరులు మరియు కూలీలు వర్షం కురిసే సమయంలో సురక్షితమైన భవనాల్లోకి వెళ్లాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వర్షం మరియు గాలివానల వల్ల కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉందని, వాహనదారులు ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలని సంస్థ తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+