పిడుగులతో భారీ వర్షాలు, అక్కడ తీవ్ర వడగాలులు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరికలు..!!

తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత .. మరి కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. రాయలసీమలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించారు. అదే విధంగా సీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనాగా వెల్లడించారు. దీంతో.. రానున్న రెండు రోజులు కొన్ని జిల్లాల్లో వర్షాలు.. మరి కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని తెలిపింది.

రాష్ట్రంలో సోమవారం ఎండతీవ్రత, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలతో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆదివారం గరిష్ఠంగా కర్నూలు జిల్లా నగరడోనలో 45.4డిగ్రీలు నమోదైందని తెలిపారు. 279 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు వెల్లడించారు. ఈ రోజు (సోమవారం) పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, రాయలసీమ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైందుకు అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం జిల్లా : బూర్జ, హిరమండలం, పాతపట్నం, విజయనగరం జిల్లా: బాడంగి, బొబ్బిలి, బొండపల్లి, దత్తిరాజేరు, గజపతినగరం, మెంటాడ, మెరకముడిదాం, రాజాం, రామభద్రాపురం, సంతకవిటి, తెర్లాం, వంగర, పార్వతీపురంమన్యం జిల్లాలో బలిజిపేట, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం, మక్కువ, పాచిపెంట, పాలకొండ, పార్వతీపురం, సాలూరు,సీతంపేట, సీతానగరం, వీరఘట్టం మండలాల్లో(32) తీవ్ర వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొన్నారు.

apsdma-latest-alerts-over-heat-waves-rains-in-many-parts-of-andhra-pradesh-in-next-two-days

పిడుగులతో వర్షాల పై తాజా అలర్ట్స్

శ్రీకాకుళం1, విజయనగరం 7, మన్యం 1, పోలవరం 4, అనకాపల్లి 1, తూర్పుగోదావరి 2, ఏలూరు 1 మండలాల్లో(17) వడగాల్పులు వీచేందుకు అవకాశం ఉందన్నారు. ఆదివారం కర్నూలు(జి )నగరడోనలో 45.4°C, కడప(జి) ఖాజీపేటలో 44.5°C, కాకినాడ(జి) కరపలో 44.4°C, అనంతపురం(జి) రాయదుర్గం, నంద్యాల(జి) ఆళ్లగడ్డలో 44.3°C, తిరుపతి(జి)వరదయ్య పాలెం 43.8°C, మార్కాపురం(జి) అనుమలపల్లిలో 43.6°C, నెల్లూరు(జి) కొమ్మిపాడులో 43.2°C, శ్రీసత్యసాయి(జి) దాడితోటలో 43.1°C, అన్నమయ్య(జి) గాలివీడులో 42.7°C, ఒంగోలులో 42.2°C, పల్నాడు(జి) గురజాలలో 42.1డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. ద్రోణి ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పని చేసే రైతులు,పశు కాపరులు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+