మండే ఎండల వేళ భారీ వర్షాలు, ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్..!!

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం అల్లాడిపోతున్నారు. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. ఇదే సమయంలో వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ద్రోణి ప్రభావం కారణంగా ఇవాళ ఉత్తర కోస్తా ప్రాంతాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని వెల్లడించింది.

ఏపీ వాతావరణ శాఖ వర్షం పైన బిగ్ అప్డేట్ ఇచ్చింది. ద్రోణి కారణంగా రానున్న రెండు రోజుల్లో పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో మాత్రం పొడి వాతావరణం కొనసాగనుందని తెలిపింది. మున్నార్ గల్ఫ్ నుంచి తమిళనాడు, కర్ణాటక మీదుగా ద్రోణి విస్తరించి కొనసాగుతోందని వివరించింది. ఈ ద్రోణి సగటు సముద్రమట్టానికి సుమారు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడింది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల మీదుగా దిగువ ఉష్ణమండల దక్షిణ-నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నా యని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ద్రోణి ప్రభావంతో ఇవాళ ఉత్తర కోస్తా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

apsdma-warns-light-to-moderate-showers-likely-in-many-parts-of-coastal-districts-for-next-two-days

వాతావరణ శాఖ తాాజా అంచనాలు

అదే విధంగా కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని అధికా రులు తెలిపారు. కాగా, బుధవారం నుంచి రాష్ట్రంలో మళ్లీ పూర్తిగా పొడి వాతావరణం కొనసాగ నుందని అంచనా వేస్తున్నారు. దక్షిణ కోస్తా ప్రాంతాల్లో మాత్రం వేడి, తేమ ఎక్కువగా ఉండే వాతావరణం ఉండనుందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. కాగా, అటు తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుందని.. ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్‌లో ఎండ తీవ్రత సగటు కంటే ఎక్కువగా ఉంటుందని.. దక్షిణ తెలంగాణలో గాలుల దిశ మారడం వల్ల వేడి గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. సోమవారం, మంగళవారం, బుధవారం తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రాగల రెండు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఇంచుమించు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+