మహాశివరాత్రి వేళ 99 క్షేత్రాలకు 3500 బస్సులు..!!
మహాశివరాత్రి కోసం తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలు ముస్తాబవుతున్నాయి. ఈ నెల 26న మహా శివరాత్రి పర్వదినం వేళ ప్రముఖ శైవక్షేత్రాల్లో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఇందు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీశైలంలో శివరాత్రి వేళ బ్రహ్మోత్సవాలు నిర్వహణకు సర్వం సిద్దమవుతోంది. రెండు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలకు వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ బస్సు ల ఏర్పాటు పైన నిర్ణయం తీసుకుంది. మొత్తం 99 శైవ క్షేత్రాలకు 3500 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది.
అన్ని డిపోల నుంచి
మహాశివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు. ప్రతీ ఏటా వచ్చే భక్తుల రద్దీని పరిగణలోకి తీసుకొని ఈ ఏడాది అంచనాలకు తగిన విధంగా ఆలయాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో, రాష్ట్రంలోని ప్రముఖమైన 99 శైవ క్షేత్రాలకు భక్తుల రాకపోకలకు వీలుగా ఆర్టీసీ 3,500 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది. అందులో అధికంగా కడప జిల్లాలో 12 క్షేత్రాలకు, నెల్లూరు జిల్లాలోని 9, తిరుపతి జిల్లాలో 9, నంద్యాల జిల్లాలో 7 క్షేత్రాలకు బస్సులు ఏర్పాటు చేసారు.

శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు
శ్రీసత్యసాయి జిల్లా మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు ఉండేలా షెడ్యూల్ ఖరారు చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలు, ముఖ్య పట్టణాల నుంచి శ్రీశైలానికి బస్సులను కేటాయించారు. ఈ ప్రత్యేక బస్సుల ద్వారా రూ.11 కోట్ల రాబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 వరకూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే బ్రహ్మోత్సవాల రోజుల్లో శ్రీశైలంలో ఆర్జిత సేవలు రద్దు చేశారు. శివ దీక్షాపరులకు 19 నుంచి 23 వరకు స్పర్శ దర్శనం కల్పించను న్నారు. శ్రీశైలం ఆలయానికి మహాశివరాత్రి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుం టారు. అందులో భాగంగా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రత్యేక ఏర్పాట్లు
శ్రీశైలం కు వచ్చే భక్తుల కోసం ఆర్టీసీతో పాటుగా టూరిజం కార్పోరేషన్ ప్రత్యేక ప్యాకేజీలను ఖరారు చేసింది. ఇక, శ్రీశైలం వచ్చే భక్తుల రక్షణ కోసం పాతాళగంగ వద్ద రక్షణ కంచెలు ఏర్పాటు చేస్తు న్నారు. మహిళలు దుస్తులు మార్చుకునే గదులు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే శివ దీక్ష భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లను శ్రీశైలం దేవస్థానం ఏర్పాటు చేస్తోంది. మొత్తంగా శివరాత్రి బ్రహ్మోత్ సవాలకు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక.. ఇప్పటికే మంత్రులు శ్రీశైలంలో సమీక్ష చేసి.. భక్తుల కోసం తీసుకోవాల్సిన చర్యల పైన ఆలయ అధికారులకు దిశా నిర్దేశం చేసారు.












Click it and Unblock the Notifications