కుంభేమళాకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు- పుణ్యకేత్రాల రూట్, ప్యాకేజీ..!!
Mahakumbh Mela 2025: మహాకుంభ మేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. ఇప్పటి వరకు 11 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు చేసినట్లు అంచనా. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. విదేశీయులు సైతం సంప్రదాయ రీతిలో స్నానాల కోసం ప్రయాగ్ రాజ్ కు వస్తున్నారు. ఈ సమయంలోనే ఏపీ నుంచి వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీకీ కీలక నిర్ణయం తీసుకుంది. మహాకుంభ్ కు వెళ్లేవారికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. పుణ్యక్షేత్రాల సందర్శ న తో కలిపి ప్యాకేజీ ఖరారు చేసింది.
కుంభమేళాకు వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది. ఇందు కోసం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. తక్కువ ధరతోనే దర్శనం..భోజన ఏర్పాట్లు చేస్తామని స్పష్టం చేసింది. కుంభమేళా ప్యాకేజీలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల సందర్శన ఉండనుంది. ఎక్కడి నుంచి అయినా 30 మంది భక్తులు బృందంగా కుంభమేళాకు వెళ్లాలని భావిస్తే వారు కోరుకున్న కేటగిరీ బస్సు ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ సిద్దమైంది. వారికి భోజన వసతి కోసం వంట మనిషిని కేటాయించనున్నారు. ఉదయం అల్పాహారం... మధ్యాహ్నం - రాత్రి భోజనం వండిచేలా ఆర్టీసీ ఏర్పాట్లు చేయనుంది.

ఏపీ నుంచి కుంభమేళాకు వెళ్లే వారికి ప్రత్యేకంగా పూరీ, కోణార్క్, ప్రయాగ్‌రాజ్, వారణాసి, బుద్ద గయ, కాశీ తదితర క్షేత్రాల దర్శనం చేయించనున్నట్లు తెలిపారు. సూపర్ లగ్జరీ బస్సుల్లో ఒక్కొక్కరికి రానుపోను టికెట్, భోజన సదుపాయం కలిపి రూ.10,000లు, స్లీపర్ బస్సులో ఒక్కొ క్కరికీ రూ.15,000లు తీసుకుంటున్నారు. ప్రయాణీకులు బృందంగా బస్సులు బుక్ చేసుకుంటు న్నారు. రాజమండ్రి నుంచి ఫిబ్రవరి 4న ప్రత్యేక బస్సు బయల్దేరనుంది. ప్రయాణం చేసే ప్రాంతం నుంచి టికెట్ ధర ఖరారు చేయనున్నారు.
కుంభమేళాకు వెళ్లే సమయంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల సందర్శన ఉండటంతో ప్రయాణీకులు ఆసక్తి చూపుతున్నారు. రాజమండ్రి నుంచి బయల్దేరే బస్సు ప్రయాణీకులకు భువనేశ్వర్, పూరీ, కోణార్క్, బాజ్‌పూర్, ప్రయాగ్‌రాజ్, కాశీ, ఆయోధ్య, గయ, బుద్దగయ, అరసవెల్లి, అన్నవరం ఆలయాలకు తీసుకెళ్లనున్నారు. ఎంపిక చేసుకున్న బస్సు కేటగిరీకి అనుగుణంగా ప్యాకేజీ ధర ఖరారు చేస్తున్నారు. ఫిబ్రవరి 26 వరకు కుంభమేళా కొనసాగనుంది. దీంతో, కుంభమేళాకు వెళ్లేందుకు బస్సుల వైపు మొగ్గు చూపుతున్నారు.












Click it and Unblock the Notifications