ప్రయాణీకులకు APSRTC గుడ్ న్యూస్, ఉచిత బస్సు పథకంలోనూ ఇక..!!

APSRTC కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆర్టీసీ నూతన ఎండీగా ఎంటీ కృష్ణబాబు బాధ్యతలు స్వీకరించారు. ఆర్టీసీలో సమస్యల పరిష్కారం, అభివృద్ధి ప్రణాళికలపై కృష్ణబాబు అధికారులతో చర్చించారు. ఏపీఎస్ ఆర్టీసీలో కొత్త బస్సుల కొనుగోలు, బస్టాండ్ల అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై కీలక దిశా నిర్దేశం చేసారు. అదే విధంగా మహిళలకు ఉచిత బస్సు పథకం పైనా కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా కృష్ణబాబు బాధ్యతలు చేపట్టారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీలో ఈ ఏడాది మొత్తం 2,500 బస్సులు ప్రవేశపెడతామని తెలిపారు. కేంద్రం ద్వారా వచ్చే 1,050 ఎలక్ట్రిక్ బస్సులను ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. వీటికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరో 1,480 ఎలక్ట్రిక్ లేదా సీఎన్​జీ బస్సులు కొనుగోలుకు ప్రణాళికలు సిద్దం చేసినట్లు వివరించారు. కాగా.. కాలం చెల్లిన బస్సులను ఎప్పటికప్పుడు రీప్లేస్ మెంట్ కోసం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కొత్త బస్సులు వచ్చాక సంస్థలో అవసరమైన డ్రైవర్ల నియామం చేపడతామని చెప్పారు. ఇక.. ఆర్టీసీలో పదోన్నతుల సమస్యలను పరిష్కరిస్తామని ప్రకటించారు. ఆర్టీసీ సేవలు, సదుపాయాల పట్ల ప్రజల్లో మెరుగైన సంతృప్తి స్థాయి తీసుకురావడ మే లక్ష్యంగా పని చేస్తామని స్పష్టం చేసారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు పథకాన్ని మరింత సమర్థంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

apsrtc-md-krishna-babu-made-clear-directions-for-officials-over-operations-and-new-services

మహిళల ఉచిత ప్రయాణం పథకంలో

కాగా, ఆర్టీసీలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న రెగ్యులర్ డ్రైవర్, కండక్టర్ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఖాళీగా ఉన్న 7,673 రెగ్యులర్ పోస్టుల నియామకానికి అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇందులో 3,673 డ్రైవర్లు పోస్టులు, 1,813 కండక్టర్ పోస్టులు భర్తీకి అనుమతించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇక.. ఆన్ కాల్ డ్రైవర్ల రోజువారీ వేతనాన్ని రూ. 800 నుంచి రూ.1000 వరకు పెంచాలని నిర్ణయించారు. డబుల్ డ్యూటీ చేసే కండకర్లకు ఇచ్చే మొత్తాన్ని రూ. 900కి పెంచింది. త్వరలోనే ఏపీఎస్ ఆర్టీసీ కోసం కొత్తగా 1,050 ఎలక్ట్రిక్ బస్సులు సిద్దం అవుతున్నాయి. వీలైనంత త్వరగా వీటిని అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. దీంతో.. మరింతగా సేవలు పెంచే అవకాశం ఉంటుందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+