APSRTC: అద్దె బస్సుల సమ్మెపై కీలక నిర్ణయం..! సంక్రాంతి వేళ..!
సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా భారీగా అదనపు బస్సులు ప్రకటించిన ఏపీఎస్ ఆర్టీసీకి అద్దెబస్సుల ఆపరేటర్లు తాజాగా షాకిచ్చారు. ఉచిత బస్సు పథకం కింద నడుపుతున్న బస్సుల నిర్వహణ భారం ఎక్కువగా ఉందని, అదనపు మొత్తాలు చెల్లించకపోతే ఈ నెల 12 నుంచి సమ్మెలోకి వెళ్తామని తాజాగా ఆపరేటర్లు ప్రకటించారు. దీంతో అసలే సంక్రాంతి వేళ ఇబ్బందులు తప్పవని భావించిన వారితో ఇవాళ చర్చలు జరిపింది. ఈ చర్చలు ఫలించడంతో వారు సమ్మెపై వెనక్కి తగ్గారు.
ఉచిత బస్సుల్లో మహిళల రద్దీ అంతకంతకూ పెరుగుతోందని, నిర్వాహణా భారం నేపథ్యంలో తమకు ఇస్తున్న మొత్తాన్ని పెంచాలని, ఇన్సూరెన్స్ లో ఎదురవుతున్న సమస్యలు తీర్చాలని అద్దె బస్సుల ఆపరేటర్లు కోరుతున్నారు. దీనికి ప్రభుత్వం అంగీకరించకపోవడంతో ఈ నెల 12 నుంచి సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఇవాళ ప్రైవేటు ఆపరేటర్లను చర్చలకు పిలిచారు. విజయవాడలోని ఆర్టీసీ భవన్ లో ఎండీ ద్వారకాతిరుమల రావు ప్రైవేటు ఆపరేటర్లతో ఈ మేరకు చర్చలు జరిపారు.

ఈ చర్చల్లో ప్రభుత్వం తరఫున ఈ నెల 20 వరకూ సమయం ఇవ్వాలని ప్రైవేటు బస్సు ఆపరేటర్లను కోరారు. దీనికి వారు కూడా అంగీకరించడంతో పాటు సమ్మె నిర్ణయాన్ని విరమించుకుంటున్నట్లు వారు తెలిపారు. సంక్రాంతి వేళ ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆపరేటర్లు చెప్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సమయం కోరడంతో సమ్మెను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications