ఆర్టీసీ బస్సుల్లో వైజాగ్ స్టేడియానికి క్రికెటర్లు ! బీసీసీఐ, ఇంగ్లిష్ బోర్డుకు థ్యాంక్స్..!
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)తో పాటు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)కి ఏపీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ ఏపీఎస్ ఆర్టీసీ ఇవాళ ధన్యవాదాలు తెలిపింది. ఈ మేరకు ఈ రెండు బోర్డుల్ని ట్యాగ్ చేస్తూ ఎక్స్ లో ట్వీట్ చేసింది. అయితే బీసీసీఐ, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుతో ఏపీఎస్ ఆర్టీసీకి ఏం సంబంధం ? ఈ రెండు ధనిక బోర్డులకు ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఆర్టీసీకి ఎందుకు వచ్చిందో ఇప్పుడు చూద్దాం..
APSRTC Buses being used by Team India and Team England cricket teams for the second test at Visakhapatnam
— APSRTC (@apsrtc) February 2, 2024
Thank you for patronising us @bcci @englandcricket#INDvsENGTest pic.twitter.com/AOPUvNtQ0v
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా విశాఖలో రెండో టెస్టు జరుగుతోంది. ఇప్పటికే హైదరాబాద్ ఉప్పల్ స్డేడియంలో తొలి టెస్టు పూర్తి చేసుకున్న టీమ్ ఇండియా, టీమ్ ఇంగ్లండ్ క్రికెటర్లు విశాఖకు ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. అక్కడి నుంచి హోటళ్లకు, అలాగే విశాఖలోని డాక్టర్ వైఎస్సార్ వీసీఏ-ఏడీసీఏ క్రికెట్ స్టేడియానికి వెళ్లేందుకు ప్రైవేటు బస్సులు కాకుండా ఆర్టీసీ బస్సుల్ని క్రికెటర్లు వాడుకున్నారు. దీంతో ఆర్టీసీ కూడా సంతోషంగా బస్సులు ఏర్పాటు చేసింది.

ఇలా అంతర్జాతీయ క్రికెటర్లు తమ బస్సుల్లో ప్రయాణించడంతో ఆర్టీసీ అధికారులు సంతోషంలో మునిగిపోయారు. ఈ మేరకు ఎక్స్ లో తమ సంతోషాన్ని పంచుకున్నారు. విశాఖలో జరుగుతున్న రెండు టెస్టు కోసం టీమ్ ఇండియా, టీమ్ ఇంగ్లండ్ క్రికెటర్లు తమ బస్సుల్లో ప్రయాణించారని ఆర్టీసీ ట్వీట్ చేసింది. అంతే కాదు తమకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు కూడా తెలిపింది. ఈ మేరకు రెండు బోర్డుల అధికారిక హ్యాండిల్స్ ను ట్యాగ్ చేసింది.












Click it and Unblock the Notifications