• search
  • Live TV
శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

త్వరలోనే మంత్రివర్గంలోకి కిడారి శ్రావణ్ కుమార్?: బాబు ఆలోచన ఇదే, మైనార్టీ వర్గం నుంచి మరొకరు

|

అమరావతి: ఇటీవల మావోయిస్టుల కాల్పుల్లో మరణించిన అరకు టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కిడారి సర్వేశ్వరరావు పెద్ద కుమారుడు శ్రావణ్‌కుమార్‌ను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంపై పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

ఐఐటీ నుంచి ఇంజనీరింగ్‌ చదివిన శ్రావణ్‌కుమార్‌ను మంత్రివర్గంలోకి తీసుకుని కీలక శాఖ అప్పగిస్తే, ప్రజల్లోకి.. ప్రత్యేకించి గిరిజనుల్లోకి మంచి సంకేతాలు వెళతాయని ఆయన ఆలోచిస్తున్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఇది కలిసే వచ్చే అంశంగా టీడీపీ అధిష్టానం భావిస్తోంది.

 రాజకీయంగా సానుకూలం..

రాజకీయంగా సానుకూలం..

అంతేగాక, గిరిజనులకు మంత్రివర్గంలో అవకాశమివ్వలేదనే విమర్శ తొలగిపోవటంతోపాటు రాజకీయంగానూ సానుకూలత ఏర్పడుతుందని టీడీపీ భావిస్తోంది. గతంలో భూమా నాగిరెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని భావించగా, ఆయన ఆకస్మికంగా మరణించారు. దీంతో నాగిరెడ్డి కుమార్తె అఖిలప్రియకు అవకాశం కల్పించారు. రాయలసీమలో పార్టీకి అదొక సానుకూల పరిణామంగా మారింది.

అచ్చెన్నాయుడితో విభేదాలు, అదే నా వీక్నెస్, బాధేసింది: రామ్మోహన్ కీలక వ్యాఖ్యలు

అక్టోబర్‌లోనే మంత్రివర్గ విస్తరణ

అక్టోబర్‌లోనే మంత్రివర్గ విస్తరణ

కిడారి మరణం తర్వాత ఇప్పుడు శ్రావణ్‌కుమార్‌కు కూడా మంత్రివర్గంలో అవకాశమిస్తే గిరిజన వర్గాల నుంచి ఆదరణ లభిస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అన్నీ అనుకూలిస్తే ఈ అక్టోబరులోనే మంత్రివర్గ విస్తరణ జరగొచ్చు. 2014లో అధికారంలోకొచ్చినప్పటి నుంచి మైనారిటీలు, గిరిజనులకు మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు. మైనారిటీల నుంచి టీడీపీ తరఫున ఒక్కరు కూడా శాసనసభకు ఎన్నికవలేదు. గిరిజనుల నుంచి ఒకరు ఎన్నికైనా అవకాశం రాలేదు. వైసీపీ నుంచి టీడీపీలోకొచ్చిన శాసనసభ్యుల్లో ఈ రెండు వర్గాలకు చెందిన వారున్నా వివిధ కారణాలతో మంత్రివర్గంలోకి తీసుకోలేదు.

చంద్రబాబు ఆలోచన ఇదే..

చంద్రబాబు ఆలోచన ఇదే..

కాగా, అరకు శాసనసభ్యుడు సర్వేశ్వరరావు మావోయిస్టుల కాల్పుల్లో మరణించటంతో.. రాష్ట్ర మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న మరో స్థానాన్ని అతని కుమారుడు శ్రావణ్‌ కుమార్‌తో భర్తీ చేయటంపై తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి పెట్టారు. శాసనసభ, మండలిలో ఎందులోనూ ఆయన సభ్యుడు కాదు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఆరునెలల్లోగా ఏదోఒక సభకు ఎన్నికవాలి. ఆలోగా శాసనసభకు సాధారణ ఎన్నికలే రానున్నాయి. ఇప్పటికిప్పుడు అరకు స్థానానికి ఉపఎన్నికలు జరిగే అవకాశమూ లేదు. ముందు శ్రావణ్‌ని మంత్రిగా తీసుకుంటే... ఆ తరువాత అవకాశముంటే శాసనమండలికి ఎన్నికయ్యేలా చూడటం, లేదంటే ఆరు నెలల సమయం ముగిశాక రాజీనామా చేయించి సాధారణ ఎన్నికల్లో అరకు నుంచి పోటీ చేయించటం అనే అంశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

మైనార్టీ వర్గం నుంచి ఒకరికి మంత్రివర్గంలో చోటు

మైనార్టీ వర్గం నుంచి ఒకరికి మంత్రివర్గంలో చోటు

తాజాగా, తొలి నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న ప్రస్తుత శాసనమండలి ఛైర్మన్‌ ఎన్‌ఎండి ఫరూక్‌ పేరును మైనారిటీ కోటా నుంచి పరిశీలిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నుంచి శాసనసమండలి సభ్యుడు షరీఫ్‌ కూడా ఉన్నప్పటికీ, సీనియారిటీతోపాటు మైనారిటీల జనాభా అధికంగా ఉన్న రాయలసీమకు ప్రాతినిథ్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఫరూక్‌ వైపు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఫరూక్‌ను ఎంచుకుంటే ఖాళీ అయ్యే శాసనమండలి ఛైర్మన్‌ స్థానానికి షరీఫ్‌ ప్రధాన పోటీదారుగా మారతారు. మైనారిటీల కోటా నుంచి ఒకరిని ఎంచుకుంటే, రెండో స్థానాన్ని మొదట్లో గిరిజనుల నుంచి తీసుకోవాలా? బలహీనవర్గాల నుంచి ఎంపిక చేసుకోవాలా? అన్న దానిపై చర్చ జరుగుతోంది.

English summary
Araku mla kidari son sravan kumar may join ap cabinet soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more