సన్‌ఫ్లవర్ ఆయిల్ యొక్క ఆరోగ్య ప్రభావం–సైన్స్ ఏమంటుంది..?

సన్‌ఫ్లవర్ ఆయిల్ మన భారతదేశంలో కోట్లాది మంది ప్రజల జీవితాల్లో భాగమైంది. దీని ప్రాముఖ్యతను ఇప్పటి వరకు ఎవరికి పెద్ద సందేహాలు లేవు. ఇది చాలా తేలికైనది, చవకైనది, పెద్దగా రుచిలేనిది. దశాబ్దాలుగా ఇది అన్నింటికంటే ఆరోగ్యకరమైన అనే భావన ఉంది. ప్రస్తుతం దీని వాడకంపై సమీక్షించాల్సిన అవసరం ఉంది. సన్‌ఫ్లవర్ ఆయిల్ హానికరమని చెప్పడం కాదు. పరిశోధకులు ప్రకారం సన్‌ఫ్లవర్ ఆయిల్స్‌ను నిరంతరం వాడడం సమంజసం కాదు. ఇది శరీరంలో అసమతుల్యతను కలిగిస్తుంది. ఇది నిశ్శబ్దంగా ఒంట్లో పేరుకుపోతుంది.

కొవ్వు నిష్పత్తి నెమ్మదిగా గుండెని ఎలా ముట్టడిస్తుంది
సన్‌ఫ్లవర్ ఆయిల్‌లో ఒమేగా-6 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా అవసరం. ప్రాసెస్, ఫాస్ట్ ఫుడ్స్ ద్వారా జనాలకు అధికంగా ఒమేగా-6 అందుతుంది. వాల్నట్స్, అవిసె గింజలు, చేపల్లో లభించే ఒమేగా-3 చాలామందికి సరిపోవడం లేదు.ఒమేగా-6, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాల నిష్పత్తి సరిగ్గా లేనందన శరీరంలో మంట, గుండె సంబంధిత వ్యాధులు, రక్తపోటు, జీవక్రియల సమస్యలు జరగవచ్చు. హార్వర్డ్ యూనివర్సిటీ, I C M R ఐతే అసమతుల్యత గురించి చెబ్తున్నారు.

sunflower-oil-health-effects-what-science-says-about-omega-6-and-heart-health

వంటశాలలో సన్‌ఫ్లవర్ ఆయిల్ పాత్ర అది మరింత దిగజారుస్తుంది.
సన్‌ఫ్లవర్ ఆయిల్‌లో PUFA కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి అధిక ఉష్ణోగ్రతల వద్ద అస్థిరంగా ఉంటాయి. ఈ నూనెను ఎక్కువ సేపు మరగించడం, వేడిచేయడం, మళ్ళీ-మళ్ళీ వాడడం వల్ల ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తి అయి హానికర సమస్యలు ఎక్కువ కాలం ఇలాంటివి వాడడం వలన ఆరోగ్యాలు దెబ్బతింటాయి.

ప్రాంతీయ వాస్తవికత
దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో సన్‌ఫ్లవర్ నూనె వాడకం ఇతర నూనెలకంటే ఎక్కువగా ఉంది. దీని వాడకాన్ని ఇప్పటి వరకు ఎవరూ ప్రశ్నించలేదు. దశాబ్దాలుగా ఇది ప్రజల నిత్య జీవితంలో భాగమైంది. ఇటీవల కాలంలో రక్తపోటు మరియు గుండె వ్యాధులు చాలా పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అనారోగ్యకర ఆహార అలవాట్లతో పాటు వేగంగా విస్తరిస్తున్న పట్టణీకరణ, కదలిక మరియు వ్యాయామం లేని జీవన విధానము, సునాయాసంగా తరచుగా తినడం వంటి అలవాట్లతో ఆరోగ్యం దెబ్బతింటున్నది.

మార్గదర్శకాలు
మే 2024 లో I C M R మరియు N I N లు ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను పునరుద్ఘాటించాయి. కొవ్వులను చాలా తక్కువ మోతాదులోనే వాడాలి. మన శరీరానికి అవసరమైన కొవ్వు ఆమ్లాలను అవి లభించే పదార్థాల ద్వారా తీసుకోవాలి. ఏ ఒక్కరకమైన నూనె కూడా సంపూర్ణం కాదు. సన్‌ఫ్లవర్ ఆయిల్‌లో విటమిన్-ఈ, లభిస్తుంది. అవసరమైన ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. తక్కువ సానెలో గామా ఒరిజనాల్ అధికంగా లభిస్తుంది.

కాబట్టి ఒకే రకమైన నూనెను వాడకుండా సరైన నిష్పత్తిలో మిశ్రమం చేసిన నూనెను వాడడం ఆరోగ్యకరం. ప్రస్తుతం మార్కెట్లో సఫోలా టోటల్, జెమిని, ఫార్చూన్ మరియు హార్టివా వంటి మిశ్రమ నూనెలు (మల్టీ సోర్సెస్) లభిస్తున్నాయి. వీటి రుచికూడా గణనీయంగా ఉంటుంది.

సన్‌ఫ్లవర్ ఆయిల్ మనకి శత్రువు కాదు. చెడగొనే ఆరోగ్యం కోసం వివిధ పరిశోధనా సంస్థలు పేర్కొన్న నిష్పత్తిలో కలిసిన మిశ్రమ నూనెలు (మల్టీ సోర్సెస్) మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+