సీబీఎస్ఈ పరీక్ష లోపాల పుట్ట-ప్రశ్నిస్తే దేశద్రోహులా? - రాహుల్ ఫైర్..!

ఈ ఏడాది సీబీఎస్ఈ నిర్వహించిన 12వ తరగతి పరీక్షల్లో (CBSE 12th Class Exams) పలు సమస్యలు తలెత్తాయి. వీటిలో ఓఎస్ఎం, తప్పుడు మార్కింగ్, మూల్యాంకనంలో లోపాలు ఇలా చాలానే ఉన్నాయి. వీటిపై విద్యార్ధులతో పాటు తల్లితండ్రుల నుంచీ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయినా సీబీఎస్ఈ లోపాల్ని అంగీకరించి సమస్యల్ని పూర్తిస్దాయిలో పరిష్కరించేందుకు సిద్దంగా లేదు. అటు కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సైతం ఆలస్యంగా స్పందించడంతో పాటు సమీక్షలకే సిద్దమవుతున్నారు. దీనిపై ఇవాళ విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఫైర్ అయ్యారు.

తప్పు మీది- వర్క్ ఫ్రమ్ హోమ్ అందరికా ? మోడీపై రాహుల్ ఫైర్..!
తప్పు మీది- వర్క్ ఫ్రమ్ హోమ్ అందరికా ? మోడీపై రాహుల్ ఫైర్..!

మోదీ-షా ద్వయం మరో సంస్థను రిగ్గింగ్‌కు ప్రతీకగా మార్చారని రాహుల్ గాంధీ ఎక్స్ లో విమర్శలు గుప్పించారు. దశాబ్దాల తర్వాత తొలిసారిగా సీబీఎస్ఈ బోర్డు పరీక్షలపై ఇంత తీవ్రమైన ప్రశ్నలు తలెత్తాయని ఆయన గుర్తుచేశారు. 18.5 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారని, కానీ వారం రోజులుగా ఓఎస్ఎం, తప్పుడు మార్కింగ్, మూల్యాంకనంలోని లోపాలపై వచ్చిన ఫిర్యాదులను పట్టించుకోలేదన్నారు. మరోవైపు విద్యాశాఖ మంత్రి మాత్రం తన కుర్చీకే అతుక్కుని ఉన్నారన్నారు.

Rahul Gandhi Slams Modi Over CBSE Results Row Brands 17-Year-Old Student Anti-National for Raising Voice
ఆర్ధిక తుఫాన్ లో దేశాన్ని వదిలేసి ఇటలీలో రీల్సా ? మోడీపై రాహుల్ ఫైర్..!
ఆర్ధిక తుఫాన్ లో దేశాన్ని వదిలేసి ఇటలీలో రీల్సా ? మోడీపై రాహుల్ ఫైర్..!

తప్పుగా మూల్యాంకనం చేయబడిన జవాబు పత్రంతో బాధపడుతున్న 17 ఏళ్ల బాలుడు, న్యాయం కోసం ఆశతో సోషల్ మీడియాను ఆశ్రయించాడని, కానీ సహాయానికి బదులుగా, అతనికి దూషణలే ఎదురయ్యాయని రాహుల్ ఆరోపించారు. బీజేపీ ఐటీ సెల్ అతడిని "దేశద్రోహి" అని, "సోరోస్ ఏజెంట్" అని, "డీప్ స్టేట్"లో భాగమని ముద్ర వేసిందన్నారు. 17 ఏళ్ల బాలుడు తన భవిష్యత్తు కోసం గళం విప్పగా, బీజేపీ అతడిని దేశద్రోహిగా మార్చిందన్నారు. నిజం ఏమిటంటే-మోదీ ప్రభుత్వం యువతకు, జెన్ జెడ్‌కు భయపడుతోందని తెలిపారు. ఎందుకంటే వారు ఇప్పుడు ప్రశ్నలు అడుగుతున్నారని, ప్రశ్నలు అడిగిన వారిని ఈ ప్రభుత్వం అపఖ్యాతి పాలు చేస్తుంది, బెదిరిస్తుంది, అణచివేస్తుందన్నారు. కానీ వినండి మోడీ గారూ-ఈ యువత, ఈ జెన్-జెడ్ తరమే మీ అహంకారాన్ని బద్దలుకొడుతుందని రాహుల్ హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+