NTR బర్త్‌ డేను సెలబ్రేట్ చేసిన పాకిస్థాన్ ఫ్యామిలీ.. వీడియో వైరల్

ఎన్టీఆర్ అనే మూడు అక్షరాల పదానికి ఎంతో క్రేజ్ ఉంది. టాలీవుడ్.. బాలీవుడ్ అని తేడా లేకుండా తారక్ కు ఫ్యాన్స్ ఉన్నారు. పౌరాణిక, జానపద, సాంఘిక ఇలా ఎలాంటి పాత్ర అయిన క్షణాల్లో అందులో పరకాయ ప్రవేశం చేయగల సత్తా ఎన్టీఆర్ సొంతం. ఎలాంటి కష్టమైన డైలాగ్ అయినా సింగిల్ టేక్ లో చెప్పగల నైపుణ్యం ఎన్టీఆర్ కు ఉంది. అలాగే టాలీవుడ్ లోనే బెస్ట్ డాన్సర్స్ లోనే ఎన్టీఆర్ ముందుంటారు. 1991లో బ్రహ్మార్షి విశ్వామిత్ర సినిమాలో బాల నటుడిగా ఎన్టీఆర్ సినీరంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత 1997లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన రామాయణంలో బాల రాముడిగా నటించారు.

నిన్ను చూడాలని హీరోగా మొదటి సినిమా.. ఆ తర్వాత స్టూడెంట్ నెం. 1 చిత్రంతో తారక్ కు తొలి కమర్షియల్ బ్రేక్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత 2002లో ఆది, 2003లో సింహాద్రి, రాఖీ, యమదొంగ, అదుర్స్ చిత్రాలతో మెప్పించారు. ఇక 2015 నుంచి ఎన్టీఆర్ నటుడిగా కొత్త అధ్యాయం స్టార్ట్ చేశారు. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత, ఆర్ఆర్ఆర్, దేవర పార్ట్ 1 లాంటి చిత్రాలతో వరుస హిట్స్ సాధించారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే సినిమా చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్ తాజాగా ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా మే 20న రిలీజ్ అయింది.

Pakistani Family Celebrates NTR Birthday with Heartwarming Video Goes Massively Viral Social Media

అయితే ఎన్టీఆర్ కు పాన్ ఇండియా రేంజ్ లోనే కాకుండా జపాన్, యూఎస్ఏ లో ఫ్యాన్స్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే పాకిస్థాన్ లోనూ ఎన్టీఆర్ కు ఫ్యాన్స్ ఉన్నారన్న విషయం తెలుసా..? ఎన్టీఆర్ బర్త్ డే ను పాకిస్థాన్ కు చెందిన ఓ ఫ్యామిలీ ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను యూట్యూబ్ లో పోస్ట్ చేసింది ఆ ఫ్యామిలీ.. ఆ ఛానల్ నడిపే వ్యక్తి పేరు సులేమాన్ కాగా.. ఆ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఒకే చోట చేరి ఎన్టీఆర్ 43వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ కేక్ పై డ్రాగన్ టర్న్స్ 43 అని రాయించారు. ఇంట్లో వాళ్లంతా కలిసి హ్యాపీ బర్త్ డే అన్నా అని పాడుతూ ఆ కేక్ కట్ చేసి తారక్ పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+