AIADMKలో సంక్షోభం, ఎమ్మెల్యేలు రాజీనామా- విజయ్ హామీతో, బై పోల్స్..!?

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం. AIADMK లో సంక్షోభం మొదలైంది. ఆ పార్టీలోని చీలక వర్గానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్మేలు తమ పదవులకు రాజీనామా చేసారు. ఎమ్మెల్యేలు సత్యభామ, మరగాథం, జయకుమార్‌ రాజీనామా చేశారు. స్పీకర్‌ను కలిసి రాజీనామా లేఖలు అందజేశారు. రాజీనామాల తర్వాత టీవీకే మంత్రి ఆదవ్‌ అర్జునను కలిసిన ఎమ్మెల్యేలు.. త్వరలో ఆ పార్టీలో చేరనున్నారు. బలపరీక్ష సమయంలో విజయ్‌ ప్రభుత్వానికి ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. కాగా... తమిళనాడు బై పోల్స్ ఖాయంగా కనిపిస్తున్నాయి.

తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అటు స్టాలిన్ తాజాగా విజయ్ ప్రభుత్వం త్వరలో కూలిపోతుందని హెచ్చరికలు చేస్తున్నారు. తమ మిత్రపక్షాలే విజయ్ ప్రభుత్వాన్ని కాపాడుతున్నాయని పదే పదే పదే చెబుతున్నారు. మిత్రపక్షాలు విజయ్ నిర్ణయాల ను ప్రతీ సందర్భంలో ప్రశ్నిస్తున్నారు. అటు అసెంబ్లీలో మద్దతుగా నిలిచిన అన్నాడీఎంకే చీలక వర్గంలోని కొందరు ఎమ్మెల్యేలు తిరిగి పళినిస్వామికి మద్దతుగా నిలిచేందుకు సిద్దం అవుతున్న ఈ సమయంలో విజయ్ అలర్ట్ అయ్యారు. తన గేమ్ మొదలు పెట్టారు. అన్నాడీఎంకేలోని ముగ్గురు ఎమ్మెల్యేలు తనకు మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. దీంతో... ఆ ముగ్గురు రాజీనామా చేసి వస్తే వారి సీట్లలోనే టీవీకే పార్టీ అభ్యర్ధులుగా అవకాశం ఇస్తానని హామీ ఇచ్చినట్లు పార్టీ నేతల సమాచారం.

బెంగళూరు ఎన్నికల బరిలో విజయ్ పార్టీ, మారుతున్న లెక్కలు..!!
బెంగళూరు ఎన్నికల బరిలో విజయ్ పార్టీ, మారుతున్న లెక్కలు..!!
three-aiadmk-mlas-tendered-their-resignations-to-tamil-nadu-assembly-speaker-jcd-prabhakar

తిరుచ్చి తో పాటుగా ఉప ఎన్నికలు

దీంతో.. ఈ రోజు ముగ్గురు ఎమ్మెల్యేలు స్పీకర్ కు తమ రాజీనామా లేఖలు అందించారు. దీంతో, వీరి రాజీనామాలను స్పీకర్ త్వరలోనే ఆమోదించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే తిరుచ్చి సీటు కు ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. దీంతో.. తిరుచ్చి అసెంబ్లీ తో పాటుగా ఈ మూడు స్థానాలకు ఉప ఎన్నికలు జరగటం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పుడు రాజీనామా చేసిన ముగ్గురు సైతం టీవీకే పార్టీ నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేయటం ఖాయమని తెలుస్తోంది. అయితే, ఈ ముగ్గురితోనే ప్రస్తుతం లెక్క ఆగదని.. ఇంకా బయటకు వచ్చే వారు ఉన్నారనే అన్నాడీఎంకే నేతల వ్యాఖ్యలు రాజకీయం గా ఇప్పుడు సంచలనంగా మారాయి. కేబినెట్ విస్తరణ పూర్తయిన తరువాత విజయ్ ఇప్పుడు కొత్త గేమ్ మొదలు పెట్టినట్లు స్పష్టం అవుతోంది. దీంతో.. ఇంకా ఎంత మంది ఎమ్మెల్యేలు బయటకు వస్తారు.. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఉత్కంఠగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+