ఏపీలోని ఆ రైల్వేస్టేషన్లో దెయ్యాల భయం.. అసలేం జరిగింది!
భారతదేశంలో కొన్ని మిస్టరీ రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఆ రైల్వే స్టేషన్లకు వెళ్ళగానే మనకు తెలియకుండానే ఒక భయం, నెగెటివిటీ కనిపిస్తుంది. దేశంలో ఘోస్ట్ రైల్వే స్టేషన్ గా పేరున్న బెగున్‌కొడార్ రైల్వే స్టేషన్ మాత్రమే కాదు మరికొన్ని రైల్వే స్టేషన్లలో కూడా దెయ్యాల భయం ఉంది. అటువంటి రైల్వే స్టేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉంది.
చిత్తూరు రైల్వే స్టేషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు రైల్వే స్టేషన్ కు అటువంటి హిస్టరీ నే ఉంది. చిత్తూరు రైల్వే స్టేషన్ సౌత్ ఇండియన్ రైల్వే కంపెనీ ద్వారా నిర్మించారు. ఇది మద్రాసు ప్రెసిడెన్సీలో ఒక ముఖ్యమైన రైల్వే స్టేషన్ గా ఉండేది. స్వాతంత్రం తరువాత రైల్వే లైన్ మరియు రైల్వే స్టేషన్ భారత రైల్వేకు బదిలీ చేశారు.

చిత్తూరు రైల్వేస్టేషన్ లో దెయ్యాల ఆత్మలు తిరుగుతాయని ప్రచారం
అటువంటి చరిత్ర కలిగిన చిత్తూరు రైల్వే స్టేషన్లో ఒక రెండు దెయ్యాల ఆత్మలు తిరుగుతున్నాయని గతంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. భారతదేశంలో అత్యంత హంటెడ్ రైల్వే స్టేషన్లలో ఒకటిగా దీనికి పేరు ఉందని చెబుతారు. చిత్తూరు రైల్వేస్టేషన్లో జార్ఖండ్ కు చెందిన హరి సింగ్ అనే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ జవాన్ ఆత్మ తిరుగుతుందని చెప్తారు.
రైలులో గొడవతో మృతి.. చిత్తూరు రైల్వే స్టేషన్ లో దెయ్యంగా హరి సింగ్
అక్టోబర్ 31 2013న న్యూఢిల్లీ కేరళ రైలులో ప్రయాణం చేస్తుండగా రైల్వే రక్షణదళ సిబ్బంది మరియు కొంతమంది ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ లతో జరిగిన ఘర్షణలో అతనిపై దాడి జరిగిందని చెప్తారు. తీవ్ర గాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పది రోజుల తర్వాత మరణించాడని చెప్తారు. ఆ విషాదకరమైన ఘటన జరిగిన నాటినుండి హరిసింగ్ దెయ్యంగా మారి రైల్వే స్టేషన్ ఆవరణలో తిరుగుతున్నారని, స్థానికులకు దెయ్యం కనిపించిందని చెబుతారు.
సాయత్రం అయితే నిర్మానుష్యంగా చిత్తూరు రైల్వేస్టేషన్
ఇది మాత్రమే కాదు రైల్వే ట్రాక్ పైన చంపబడిన ఒక మహిళ ఆత్మ కూడా ఈ రైల్వే స్టేషన్ పరిసరాల్లోని తిరుగుతుందని చెబుతారు. ప్రయాణికులు, రైల్వే ఉద్యోగులు తరచుగా రాత్రిపూట అరుపులు వింటారని చెబుతారు. ఈ క్రమంలోనే నేటికీ చిత్తూరు రైల్వే స్టేషన్ కు రాత్రి వేళల్లో వెళ్లాలంటే చాలామంది భయపడతారు. సాయంత్రమైతే చిత్తూరు రైల్వే స్టేషన్ నిర్మానుష్యంగా మారడానికి ఈ దెయ్యాల భయమే కారణమని స్థానికులు చెబుతారు.












Click it and Unblock the Notifications