బౌలింగ్‌లో రాణిస్తున్న అర్జున్ టెండూల్కర్: చూసేందుకు భారీగా అభిమానులు

విజయనగరం: విజీ మైదానంలో జరుగుతున్న ముంబై, విదర్భా జట్ల క్రికెట్‌ ప్రాక్టిస్‌ మ్యాచ్‌ శనివారం మూడో రోజుకు చేరుకుంది. అండర్‌-16 విభాగంలో ముంబై తరపున బౌలింగ్‌కు దిగిన క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ కుమారుడు అర్జున్‌ టెండూల్కర్‌ 61 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.

తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కి దిగిన ముంబై జట్టు 314 పరుగులు చేయగా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేపట్టిన విదర్భా జట్టు లక్ష్యాన్ని చేధించే దిశగా 295 పరుగులు చేరుకుంది. శనివారం సాయంత్రంతో మ్యాచ్‌ ముగుస్తుంది.

అంతకుముందు రోజు ఆట విషయానికస్తే.. 50 బంతుల్లో 25 పరుగులు చేసిన అర్జున్ టెండూల్కర్ ఔటయ్యాడు. ఇందులో మూడు ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. తొలి ఇన్నింగ్స్ ముంబై జట్టు 125.4ఓవర్లలో 314 పరుగులు చేసి అలౌటైంది.

Arjun Tendulkar practised in Vizianagaram stadium

అనంతరం విదర్భ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 54ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. కాగా, సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ విజ్జీ మైదానంలో క్రికెట్ ఆడుతున్నాడని తెలిసి క్రికెట్ అభిమానులు భారీగా తరలివచ్చారు.

అంతర్ రాష్ట్ర అండర్-16 క్రికెట్ మ్యాచుల్లో భాగంగా ముంబై, విదర్భ జట్ల మధ్య మ్యాచులు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విజయనగరంలో ప్రాక్టీస్ మ్యాచులు మూడురోజులపాటు జరుగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+