Arnab Cyclone: విరుచుకుపడనున్న తుఫాను, ఈ జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు..!!

ఆర్నాబ్ తుఫాను వణికిస్తోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతా నికి ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుపాను నేపథ్యంలో ఈ మూడు రోజులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరించారు. అత్యవసరం కాకుంటే ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. కాగా.. తుఫాను తీవ్రత ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్న వేళ.. పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగండం తుపానుగా బలపడిందని వాతావరణ శాఖ ప్రకటించింది. విశాఖకు 650, కాకినాడకు 730, మచిలీపట్నానికి 830, బాపట్లకు 900 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ రోజు అర్ధరాత్రికి తీవ్ర తుపానుగా, రేపు అతి తీవ్ర తుపానుగా బలపడుతుందని ప్రకటించారు. బుధవారం ఉదయం బాపట్ల-విశాఖ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు సూచించింది. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ (NDRF), ఎస్‌డీఆర్‌ఎఫ్‌ (SDRF) బృందాలను సిద్ధంగా ఉంచారు. ప్రభుత్వం ప్రత్యేక కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేస్తోంది.

భయపెడుతున్న తుఫాన్, అత్యంత భారీ వర్షాలు- ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్...!!
భయపెడుతున్న తుఫాన్, అత్యంత భారీ వర్షాలు- ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్...!!
arnab-cyclone-schools-likely-to-remain-closed-in-affected-districts-here-the-details

ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం

కాగా.. ఈ తీవ్ర తుఫాను కారణంగా 12 జిల్లాల్లో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. శ్రీకాకుళం నుంచి బాపట్ల జిల్లా వరకు ప్రభావం కొనసాగుతోంది. కోనసీమ పైన తుఫాను విరుచుకుపడే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. దీంతో.. ముందస్తు చర్యలు అధికార యంత్రాంగం ప్రారంభించింది. అనకాపల్లి, కాకినాడ, ఉమ్మడి కృష్ణా జిల్లా జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నింటికీ నేటి నుంచి ఈ నెల 29 వరకు వరుసగా మూడు రోజుల పాటు సెలవులు ప్రకటిస్తున్నట్లు అనకాపల్లి కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. కలెక్టరేట్‌తో పాటు డివిజన్, మండల కేంద్రాల్లో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. ముందస్తు అనుమతి లేకుండా అధికారులకు సెలవులు మంజూరు చేయవద్దని, సిబ్బంది అంతా తమ తమ హెడ్‌క్వార్టర్స్‌లోనే అందుబాటులో ఉండాలని కఠిన ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+