పోలవరం అంచనాల పెంపుకు జైట్లీ ఓకే, రూ.3 వేల కోట్ల బకాయిల చెల్లింపు?
పోలవరం ప్రాజెక్టు అంచనాల పెంపుకు అరుణ్‌జైట్లీ ఒకే చెప్పారు.పాత బకాయిలు రూ3వేల కోట్ల చెల్లింపుకు సానుకూలంగా స్పందించారు.అరుణ్‌జైట్లీతో చంద్రబాబునాయుడు పలు అంశాలపై చర్చించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం నాడు ఢిల్లీలో బిజిబిజీగా గడిపారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో
చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రత్యేక ప్యాకేజీని వెంటనే అమల్లోకి తీసుకురావాలని జైట్లీని చంద్రబాబు కోరారు.
కాకినాడలో పెట్రో కెమికల్ ప్రాజెక్టు ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని అడిగారు. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఈఏపీ ప్రాజెక్టులకు ఆమోదంపై అరుణ్ జైట్లీతో సీఎం చర్చించారు.

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు చేసిన పలు ప్రతిపాదనలకు అరుణ్‌జైట్లీ సానుకూలంగా స్పందించారు. తిరుమల దర్శనం టికెట్లపై జీఎస్టీ ఎత్తివేతకు అంగీకరించారు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చే అంశంపై కౌన్సిల్‌లో చర్చిస్తామని అరుణ్‌జైట్లీ ... చంద్రబాబుకు హమీ ఇచ్చారు.
పోలవరం అంచనాల పెంపును ఆమోదించేందుకు జైట్లీ సానుకూలంగా స్పందించారు. దీని ప్రకారం పోలవరం బకాయిలు రూ.3 వేల కోట్లు చెల్లించేందుకు జైట్లీ అంగీకరించారు.
మరోవైపు ఏపీ రెవెన్యూ లోటు భర్తీపై కేంద్ర ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసింది. భర్తీ అంశాన్ని త్వరగా పూర్తి చేయాలని పీఎంవో అధికారులకు సూచించింది. దీంతో లోటుపై ఏపీ రాష్ట్ర అధికారులతో కేంద్ర ఆర్థిక శాఖ చర్చించనుంది.












Click it and Unblock the Notifications