వెంకయ్య ఫోన్‌తో మెత్తబడ్డ బాబు: ప్రకటన కాపీ, విదేశాల్లో ఉన్న మోడీ ఆమోదం తర్వాతే అధికారిక ప్రకటన

అమరావతి: ఏపీకి ప్రత్యేక ప్యాకేజీని కేంద్రం ప్రకటించనుంది. ఆ దిశగా కేంద్రం కసరత్తు చేస్తోంది. ఉదారంగా ఏపీకి సాయం చేసేందుకు కేంద్రం ముందుకొచ్చింది. చంద్రబాబు డిమాండ్లను సానుకూలంగా పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, సుజనా చౌదరి రాత్రి 9 గంటల సమయంలో ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు.

ఈ సమావేశానికి టీడీపీ ఎంపీలు సీఎం రమేశ్, కొనకళ్ల నారాయణ, తోట నరసింహాం హాజరయ్యారు. ఈ భేటీలో చర్చించి కేంద్ర మంత్రులు అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు ఏపీకి ప్యాకేజీని కాసేపట్లో ప్రకటించబోతున్నారు. మీడియా సమావేశానికి ముందు వెంకయ్య సీఎం చంద్రబాబుతో ఫోన్లో సమాలోచనలు చేసినట్లుగా తెలుస్తోంది.

Arun jaitley met venkaiah naidu and sujana chowdary

ఏపీకి భారీ ప్యాకేజీ ప్రకటించనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో జైట్లీ, పీఎంఓ అధికారులు ప్రతి నిమిషం టచ్‌లో ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు డిమాండ్లను కేంద్రం సానుకూలంగా పరిశీలిస్తోంది. దీంతో విజయవాడ నుంచి చంద్రబాబు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

చంద్రబాబుతో ఫోన్ లో మాట్లాడిన ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ
ఏపీకి కేంద్రం ప్రకటించే ప్రత్యేక ప్యాకేజీపై ముఖ్యమంత్రి చంద్రాబబుతో ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడారు. ప్యాకేజీ కాపీని చంద్రబాబు పంపింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో సుదీర్ఘంగా కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ మంతనాలు జరుపుతున్నారు.

మోడీ ఆమోదం తర్వాతే అధికారిక ప్రకటన
ఏపీకి ప్రత్యేకప్యాకేజీ నివేదికను పీఎంఓ విదేశాల్లో ఉన్న మోడీకి కూడా పంపింది. మోడీ ఆమోదం తర్వాత అధికారికంగా కేంద్రం ప్రకటించనుంది.

రూ. లక్షా 50 వేల కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ
ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం రూ. లక్షా 50 వేల కోట్లతో ప్రత్యేక ప్యాకేజీని రూపొందించినట్లు తెలుస్తోంది. ఆర్ధిక ప్యాకేజీపై అటు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకాభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఏపీకి రైల్వే జోన్ ప్రకటించే విషయంలో సందిగ్ధత వీడలేదు.

ప్రతి నిమిషం టచ్‌లో చంద్రబాబుతో జైట్లీ, పీఎంఓ అధికారులు
ఏపీకి భారీ ప్యాకేజీ ప్రకటించనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో జైట్లీ, పీఎంఓ అధికారులు ప్రతి నిమిషం టచ్‌లో ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు డిమాండ్లను కేంద్రం సానుకూలంగా పరిశీలిస్తోంది. చంద్రబాబు ఆదేశాల మేరకు ప్యాకేజీలో మార్పులు చేస్తున్నారు. దీంతో విజయవాడ నుంచి చంద్రబాబు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

అరుణ్ జైట్లీతో వెంకయ్య భేటీ
ఏపీకి సాయం విషయమై నార్త్ బ్లాక్ లోని కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయంలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీతో మంత్రులు వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి, టీడీపీ ఎంపీలు సమావేశమయ్యారు. పారిశ్రామిక నిధి ఏర్పాటు అంశానికి సంబంధించి జైట్లీ స్పష్టంగా ఒక ప్రకటన చేయనున్నారు. 2014 ఏప్రిల్ తర్వాత పోలవరానికి అయిన ఖర్చును కేంద్రప్రభుత్వం భరించనున్నట్లు సమాచారం. ప్రత్యేక హోదా వల్ల 30 శాతం నిధులు ఈఏపీ ప్రాజెక్టు ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఆర్ధిక శాఖ నుంచి పీఎంఓకు చేరిన ప్యాకేజి ప్రతిపాదన
చంద్రబాబుతో చర్చించి ప్యాకేజీకి కేంద్రం తుది మెరుగులు దిద్దుతోంది. ఏపీకి భారీ ప్యాకేజి ప్రతిపాదన ఆర్ధిక శాఖ నుంచి పీఎంఓకు చేరింది. పీఎంఓ నుంచి స్పష్టత వచ్చిన వెంటనే కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో రైల్వే మంత్రి సురేశ్ ప్రభు కూడా పాల్గొంటారు. అయితే ఏపీకి రైల్వే జోన్ ప్రకటించే విషయంలో సందిగ్ధత వీడలేదు.

పారిశ్రామిక నిధి ఏర్పాటుపై కేంద్రం నిర్ణయం త్వరలో ప్రకటన
కాగా, పారిశ్రామిక రాయితీలు మినహా మిగతా అంశాలు ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. విశాఖ- చెన్నై కారిడార్ నిధుల ఖర్చు కేంద్ర వాణిజ్య శాఖ భరించనున్నట్లు తెలుస్తోంది. పోలవరం, రాజధాని నిర్మాణం, నౌకాశ్రయాల ఖర్చుపై కీలక ప్రకటన చేసే అవకాశమూ లేకపోలేదు. ఏడు వెనుకబడిన జిల్లాలకు ఆరేళ్ల పాటు రూ.350 కోట్ల నిధుల చొప్పున ప్రకటించే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+