• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

షాక్: జగన్‌కు చర్చి, మసీదు కనపడవా -హిందూ ఆలయాల్లో కొవిడ్ సెంటర్లపై టీడీపీ,బీజేపీ వ్యతిరేకత,విమర్శలు

|

ఆంధ్రప్రదేశ్ లో కరోనా విలయతాండవం కొనసాగుతూ రోజువారీ కొత్త కేసులు, మరణాలు భారీగా నమోదవుతోన్న దరిమిలా వైరస్ వ్యాప్తి కట్టడికి, రోగుల సంరక్షణకు జగన్ సర్కారు అనేక కార్యక్రమాలు చేపట్టింది. కొవిడ్ తోపాటు బ్లాక్ ఫంగస్ చికిత్సనూ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చిన వైసీపీ సర్కారు, దేశంలోనే తొలిసారిగా కొవిడ్ వల్ల అనాథలైన పిల్లల పేరిట రూ.10లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ లాంటి వినూత్న నిర్ణయాలూ తీసుకుంది. యాక్టివ్ కేసులు భారీగా పెరుగుతున్నందున ఆస్పత్రులు నిండుకోవడంతో అందుబాటులో ఉన్న ఇతర సదుపాయాలనూ కొవిడ్ కేర్ సెంటర్లుగా మార్చుతోన్న జగన్ సర్కారు తాజాగా రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలు, వాటి ప్రాంగణాల్లోని ధర్మసత్రాల్లోనూ కొవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేసింది. అనూహ్యరీతిలో ప్రతిపక్షాలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. బీజేపీ, టీడీపీ నేతలు షాకింగ్ కామెంట్లు చేశారు..

 ఎంపీ రఘురామ వివాదంలో మరో ట్విస్ట్ -జగన్ సర్కారుపై సుప్రీంకోర్టుకు ఆ రెండు ఛానళ్లు -ఎదురుదెబ్బ? ఎంపీ రఘురామ వివాదంలో మరో ట్విస్ట్ -జగన్ సర్కారుపై సుప్రీంకోర్టుకు ఆ రెండు ఛానళ్లు -ఎదురుదెబ్బ?

అన్ని ప్రముఖ ఆలయాల్లో..

అన్ని ప్రముఖ ఆలయాల్లో..


కొవిడ్ రోగులకు వైద్య సేవలను మరింత దగ్గర చేసేలా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 16 పెద్ద ఆలయాల ఆధ్వర్యంలో 1000 పడకలతో కోవిడ్‌ కేర్‌ సెంటర్లను దేవాదాయ శాఖ అందుబాటులోకి తెచ్చింది. చాలా చోట్ల 100 పడకలు, ఒకటి రెండు చోట్ల 25 పడకలతో చిన్న కోవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటయ్యాయి. కాగా, దీనిపై తొలుత బీజేపీ టాప్ నేత కన్నా లక్ష్మి నారాయణ, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఏపీలో ఎన్నో కన్వెన్షన్ సెంటర్లు, విద్యా సంస్థల ప్రాంగణాలు ఖాళీగా ఉన్నా జగన్ సర్కారు ఆలయాల్లోనే కొవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయడం హిందువుల మనోభావాలను అగౌరపరిచేలా ఉందని కన్నా ఆగ్రహించగా, ఆలయాల్లో ఏర్పాటు చేసిన కొవిడ్ సెంటర్లు కేవలం అర్చకులు, దేవాదాయ శాఖ సిబ్బందికి మాత్రమే వినియోగిస్తున్నామని, నిష్ఠలు పాటించే అర్చకులు, వారి కుటుంబీకులకు ఇతర చోట్ల కంటే ఆలయప్రాంగణాల్లోనే చికిత్స మంచిదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లంపల్లి వివరణ ఇచ్చారు. కానీ..

tirumala: బిచ్చగాడి ఇంట్లో రూ.10లక్షలు -అంతా స్వాధీనం చేసుకున్నTTD - అసలేం జరిగిందటే..tirumala: బిచ్చగాడి ఇంట్లో రూ.10లక్షలు -అంతా స్వాధీనం చేసుకున్నTTD - అసలేం జరిగిందటే..

హిందూ ఆలయాల్లో అవి వద్దు

హిందూ ఆలయాల్లో అవి వద్దు

ఆలయాల్లోని సత్రాల్లో కొవిడ్ సెంటర్ల ఏర్పాటుపై జగన్ సర్కారు స్పష్టమైన వివరణ ఇవ్వడం, బీజేపీ టాప్ నేత కన్నాకు మంత్రి వెల్లంపల్లి సమాధానం చెప్పిన తర్వాత కూడా ఈ వ్యవహారంపై రాజకీయ విమర్శలు కొనసాగాయి. కోవిడ్ కేంద్రాలుగా హిందూ దేవాలయాలను తీసుకోవడం సరికాదని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చి రాంప్రసాద్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరు చూస్తుంటే అర్చకులను కూడా కోవిడ్ కేంద్రాల్లో విధులు నిర్వహించాలనే ఆదేశాలిచ్చేలా ఉందన్నారు. ఆలయాలకు బదులు స్కూళ్లు, కాలేజీలను కోవిడ్ కేంద్రాలుగా మార్చుకోవాలని సూచించారు. కరోనా విలయకాలంలో అర్చక కుటుంబాలను ఏరకంగా ఆదుకోని జగన్..180కి పైగా దేవాలయాలపై దాడులు జరిగినా పట్టించుకోలేదని రాంప్రసాద్ నిందించారు.

జగన్.. చర్చి, మసీదులు వదిలారేం?

జగన్.. చర్చి, మసీదులు వదిలారేం?

కేవలం హిందూ ఆలయాల్లో మాత్రమే కొవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయడం, చర్చిలు, మసీదుల వంటి ఇతర మతాల ప్రార్థనా స్థలాల జోలికి పోకపోవడం విడ్డూరంగా ఉందని ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేశ్ నాయుడు అన్నారు. ‘‘చర్చిలు , మసీదులు ఎందుకు అత్యవసర సేవలకు నోచుకోలేదు? జగన్ కు ఈ కపట ప్రేమ ఎందుకు? దీనినే చౌకబారు రాజకీయం అనుకోరాదా? అన్ని మతాలలో కరోనా బాధితులు ఉన్నప్పుడు, వారి ప్రధాన ఆలయాలను కొవిడ్ సెంటర్లుగా జగన్ ఎందుకు తీసుకోవడంలేదు? కేవలం హిందూ ఆలయాల్లోనే కొవిడ్ సెంటర్లు పెడతామంటే మేం నిర్ద్వందంగా ఎండగడతాం. కేవలం ప్రశ్నించేవారు లేకపోవడం, చెప్పినదానికి తలూపే దేవాదాయ మంత్రి ఉండటం వల్లే ఏపీలో ఈ పరిస్థితి నెలకొంది'' అని బీజేపీ నేత రమేశ్ విమర్శించారు.

English summary
As The Andhra Pradesh government said there will be 1,000 beds in 16 major temples in the state while the smaller ones will have 25 beds, all opposition parties opposed the move and slams cm jagan. TDP state executive secretary Buchi Ramprasad said it was inappropriate to take Hindu temples as covid centers. BJP state secretary Nagotu Ramesh Naidu questioned why not churches and mosques were not looking for emergency covid services.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X