• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మోదీకి గుడ్ బై, ప్రధానిగా గడ్కరీ -ఆర్కే బాంబు -కేంద్రానికి చంద్రబాబు మద్దతు -ఊసరవెల్లి మళ్లీ అంటూ

|

కొవిడ్ నిర్వహణలో దారుణంగా విఫలమయ్యారంటూ మోదీ సర్కారుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతోన్న తరుణంలో అదే కేంద్రానికి టీడీపీ మద్దతు పలకడం, ఆ మేరకు పార్టీ మహానాడులో రాజకీయ తీర్మానం కూడా చేయడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా మారింది. ఏపీకి అన్ని విధాలా అన్యాం చేసిన బీజేపీని మళ్లీ ఎలా సమర్థిస్తారంటూ చంద్రబాబుపై ఏపీలోని ఇతర పార్టీలు నిలదీశాయి. ప్రధాని పదవి నుంచి మోదీని తప్పించాలని బీజేపీనే యోచిస్తున్నదని, అలాంటిది బాబు మద్దతు పలకడం హాస్యాస్పదమంటూ సీపీఐ రామకృష్ణ బాంబు పేల్చారు. వైసీపీ సైతం బాబు-బీజేపీల పున:కలయికపై విమర్శలు చేసింది. వివరాలివి..

కరోనాలో మోదీ సర్కార్ అనూహ్యం -ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వ దరఖాస్తులు -CAA రూల్స్ లేకున్నాకరోనాలో మోదీ సర్కార్ అనూహ్యం -ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వ దరఖాస్తులు -CAA రూల్స్ లేకున్నా

జగన్‌తో ఫైట్, మోదీతో దోస్తీ

జగన్‌తో ఫైట్, మోదీతో దోస్తీ

కరోనా వేళ డిజిటల్ విధానంలో జరిగిన మహానాడులో.. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి సహకరించాలని, జగన్ నాయకత్వంలోని రాష్ట్ర సర్కారుపై పోరాటం చేయాలని టీడీపీ నిర్ణయిచింది. ఈ మేరకు యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన రాజకీయ తీర్మానానికి మహానాడు ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వానికి అంశాల వారీగా మద్దతు ఇస్తామని, జగన్‌ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తున్న వారిని కలుపుకుని పోరాటం సాగింస్తామని, ఆ క్రమంలో కలిసివచ్చే పార్టీలను కలుపుకొని పోవాలని టీడీపీ తీర్మానించింది. అయితే..

కూలీలకు వజ్రాలు దొరికాయి -కర్నూలు జిల్లా తుగ్గలిలో జోరుగా వేట -రైతుకు రూ.1.2కోట్లు -ఎగబడుతోన్న జనంకూలీలకు వజ్రాలు దొరికాయి -కర్నూలు జిల్లా తుగ్గలిలో జోరుగా వేట -రైతుకు రూ.1.2కోట్లు -ఎగబడుతోన్న జనం

ఏపీని ఆగం చేసిన కేంద్రంతో..

ఏపీని ఆగం చేసిన కేంద్రంతో..

మోదీ సర్కారకు మద్దతు ఇస్తామంటూ మహానాడులో టీడీపీ తీర్మానం చేయడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ(ఆర్కే) తీవ్రంగా తప్పుపట్టారు. శనివారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రానికి ఏ అంశాలలో ఏ విధంగా మద్దతు ఇస్తారో‌ చంద్రబాబు చెప్పాలని, విభజన హామీలు అమలు చేయలేదని, ప్రత్యేక హోదాపై మాట తప్పారని మోదీని నిందించి, మళ్లీ యూటర్న్ నిర్ణయాలేంటని ఆర్కే మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడతానంటోన్న చంద్రబాబుకు ఆ సంస్థను ప్రైవేటు పరం చేసింది కేంద్రమే అనే సంగతి తెలీదా, మోదీ సహకారం లేకుండా అమరావతిని ధ్వంసం చేసే ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉండేదా, ఏపీని అన్ని విధాలుగా నాశనం చేసిన, చేస్తోన్న మోదీ సర్కారుకు చంద్రబాబు మద్దతివ్వడం హాస్యాస్పదమంటూ రామకృష్ణ ఫైరయ్యారు. అంతటితో ఆగకుండా..

మోదీకి పదవీ గండం..

మోదీకి పదవీ గండం..

కేంద్రానికి మద్దతు విషయంలో చంద్రబాబును తట్టిపోసిన సీపీఐ రామకృష్ణ అటు ప్రధాని మోదీపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. కొవిడ్ నిర్వహణలో విఫలమైన మోదీని ప్రధాని పదవి నుంచి తప్పించిన, ఆ స్థానంలో నితన్ గడ్కరీ లేదా రాజ్ నాథ్ సింగ్ లలో ఒకరిని కూర్చోబెట్టే దిశగా బీజేపీలో చర్చ జరుగుతోందని రామకృష్ణ చెప్పారు. నిజానికి పీఎం పోస్టు విషయంలో మోదీ, గడ్కరీల మధ్య చాలా కాలంగా వాదులాట ఉందని, మోదీ కేబినెట్ లో ఉంటూ కేంద్ర నిర్ణయాలను గడ్కరీ అప్పుడప్పుడూ తప్పుపడుతుండటం, వ్యాక్సిన్ల ఉత్పత్తి కోసం కేంద్రం ఏం చేస్తున్నదో తెలీదని ఇటీవల గడ్కరీ వ్యాఖ్యానించడం, గడ్కరీని నిలువరించే క్రమంలో ఆయనకు పలు స్కాముల్లో భాగస్వామ్యం ఉందంటూ తరచూ వార్తలు రావడం.. ఇవన్నీ పదవికోసం జరుగుతోన్న పోటీలో భాగమేనే విశ్లేషణలున్నాయి.

కరోనా విలయానికి బాధ్యత ప్రధానిదే

కరోనా విలయానికి బాధ్యత ప్రధానిదే


దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరగడంతో ఆర్థిక వ్యవస్థ దెబ్బ తిన్నదని, దీనికి ప్రధాని మోదీనే బాధ్యత వహించాలని సీపీఐ రామకృష్ణ అన్నారు. కరోనా తొలి వేవ్ ను కంట్రోల్ చేసిన ఘనత మోదీదే అని బీజేపీ జాతీయ కార్యవర్గం తీర్మానం చేసిందని, అలాంటప్పుడు సెకండ్ వేవ్‌లో ‌వైఫల్యానికి కూడా మోదీనే కారకుడవుతాడని, అలా కాకుండా ఫెయిల్యూర్ ను రాష్ట్రాలపై నెట్టేసేందుకు బీజేపీ ప్రయత్నించడం దారుణమని సీపీఐ నేత అన్నారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహణ, కుంభమేళా వల్లే భారీగా కేసులు పెరిగాయని, ప్రజల ప్రాణాల కన్నా ఎన్నికలలో విజయమే ప్రధానంగా మోదీ పని చేశారని రామకృష్ణ విమర్శించారు.

బీజేపీకి బాబు మద్దతుపై జగన్ పార్టీ..

బీజేపీకి బాబు మద్దతుపై జగన్ పార్టీ..

టీడీపీ మహానాడులో రాజకీయ తీర్మానం ద్వారా కేంద్రంలోని బీజేపీకి చంద్రబాబు మద్దతు పలకడంపై అధికార వైసీపీ నేతలు సెటైర్లు వేశారు. ‘‘బీజేపీకి మద్దతు పలికిన చంద్రబాబు.. మళ్ళీ రంగు మార్చిన ఊసరవెల్లి !'' అంటూ వైసీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. టీడీపీ మహానాడుపై వైసీపీ ఎంపీ విజయాసాయిరెడ్డి సైతం విమర్శలు చేశారు. ‘‘వెన్నుపోటు పొడిచాక నాలుగేళ్లపాటు పార్టీ ఆఫీసుల్లో కూడా ఎన్టీఆర్ ఫోటో కనిపించకుండా చేశాడు చంద్రబాబు. ఎన్టీఆర్ మానసిక వ్యధతో మరణించేంత వరకు మహానాడుల్లో కూడా ఆయన పేరు వినిపించకుండా జాగ్రత్త పడ్డాడు. 2004 ఎన్నికల సమయంలో ఆయన పేరును వాడుకున్నా ఓడిపోయాడు. ఎన్టీఆర్ ను పొగుడుతున్నారో హేళన చేస్తున్నారో తెలియనంత అమాయకులేం కాదు జనం. ఏటా రెండుసార్లు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేయడం 20 ఏళ్లుగా జరుగుతోంది. ఇప్పుడు పుస్తకాలు రాస్తారంట. ఎన్నికల ముందు బాలయ్య నటించిన రెండు సినిమాల్లో ఎన్టీఆర్ కంటే బాబునే యుగపురుషుడిగా ఎలివేషన్ ఇచ్చారు''అని సాయిరెడ్డి పేర్కొన్నారు.

English summary
as tdp decided to support modi govt and passed a resolution in makhana, creates political storm in andhra pradesh. cpi leader ramakrishna slams chandrababu for supporting centre. rama krishna also said that bjp is thinking to change modi and prime minister post to gadkari or rajnath. meanwhile, ysrcp leader ambati rambabu, vijayasai reddy also slams chandrababu for supporting bjp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X