జగన్‌కు షాకిచ్చిన చంద్రబాబు సర్కార్..

YS Jagan Mohan Reddy: అధికారాన్ని కోల్పోయిన అతి కొద్ది రోజుల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సారథ్యంలోని తెలుగుదేశం సంకీర్ణ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది.

జగన్ భద్రతను భారీగా కుదించింది. ముఖ్యమంత్రి నుంచి ఓ సాధారణ ఎమ్మెల్యే స్థాయి వరకు జగన్ భద్రతను తగ్గించింది. తాడేపల్లిలో గల వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయం ముందు ఉన్న రోడ్డుపై ఆంక్షలను సైతం ఎత్తివేసింది. రోడ్డుకు ఇరువైపులా ఉన్న బారికేడ్లను సైతం తొలగించింది.

As the security cover of former CM YS Jagan was reduced to an MLA

ఈ రోడ్డుపై రోడ్డుపై రాకపోకలు సాగించడానికి సాధారణ ప్రజలకు అనుమతి ఇచ్చింది. ఫలితంగా ఎలాంటి ప్రత్యేక భద్రత అనేది తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి లేకుండా పోయింది. ఎలాంటి ఆంక్షలు లేకపోవడం, బ్యారికేడ్లను ఎత్తివేసిన వెంటనే కొంతమంది వైఎస్ జగన్ ఇంటి ముందుకు వచ్చి రచ్చ చేయడం ఆయన కుటుంబీకులను ఆందోళనకు గురి చేసింది. ఓ న్యూస్ ఛానల్ అక్కడే కవరేజీ ఇవ్వడం కనిపించింది.

దీని తరువాత జగన్ అనూహ్య నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రైవేటు భద్రతా సిబ్బందిని నియమించుకున్నారు. తన రక్షణ కోసం జగన్ 30 మందితో కూడిన ఓ ప్రైవేట్ సెక్యూరిటీ టీమ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం ప్రస్తుతం ప్రైవేటు సిబ్బంది చేతుల్లోకి వెళ్లింది.

As the security cover of former CM YS Jagan was reduced to an MLA

ప్రభుత్వం భద్రతను కుదించడం, ఇంటిముందు ఆంక్షలను ఎత్తేయడం, పోలీసులు పరిమిత సంఖ్యలో ఉన్న నేపథ్యంలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన జిల్లాల పర్యటనకు వెళ్లినప్పుడు ప్రొటొకాల్ ప్రకారం మాత్రమే ఆయనకు స్థానిక పోలీసుల నుంచి భద్రత లభిస్తుంది.

జగన్ భద్రతను కుదించడం పట్ల వైఎస్ఆర్సీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తోన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో విజయవాడలో ఆయనపై రాళ్ల దాడి జరగడం, పోలింగ్ ముగిసిన తరువాత లండన్‌ వెళ్లడానికి గన్నవరం విమానాశ్రయం చేరుకున్నప్పుడు ఓ వ్యక్తి హల్‌చల్ చేయడం వంటి పరిణామాలను దృష్టిలో ఉంచుకుని, జగన్ భద్రతను పునరుద్ధరించాలంటూ డిమాండ్ చేస్తోన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+