ఒక రాష్ట్రంలో మరో రాజధానా?: సోనియాతో అసద్ భేటీ

హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా చేయవద్దని తాను సోనియాను కోరినట్లు చెప్పారు. మంత్రుల బృందానికి(జివోఎం)కు ఏ నివేదిక ఇచ్చానో సోనియాకు అదే ఇచ్చానని చెప్పారు. హైదరాబాదును యూటి చేయవద్దని తాను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలను కలుస్తానని చెప్పారు. హైదరాబాదు ఉమ్మడి రాజధానికి అంగీకరించమన్నారు.
కిరణ్‌కు శక్తి లేదు: సత్యనారాయణ
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి విభజనను ఆపే శక్తి లేదని ఆర్టీసి చైర్మన్ ఎం సత్యనారాయణ హైదరాబాదులో అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే సమైక్యవాదం అంటున్నారని ధ్వజమెత్తారు.
పళ్లం రాజుకు టి సెగ
కేంద్రమంత్రి పళ్లం రాజుకు హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో తెలంగాణ సెగ తగిలింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విభజన ప్రక్రియ వేగంగా జరుగుతోందన్నారు. పదకొండు అంశాల పైన తాము జివోఎంకు నివేదిక ఇచ్చామన్నారు. సీమాంధ్ర విద్యార్థులు, ఉద్యోగులకు ఎలాంటి నష్టం జరగకుండా చూడటం తమ బాధ్యత అన్నారు.












Click it and Unblock the Notifications