వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుడులు తిరుగుతూ ఏపీ తీరానికి దూసుకొస్తోన్న తుఫాన్: కోస్తాంధ్రాలో భారీ వర్షాలు, ఈదురుగాలుల బీభత్సం

|
Google Oneindia TeluguNews

బంగాళాఖాతంలో ఏర్పడిన అసానీ తుఫాన్ రెండు రాష్ట్రాలను గడగడలాడిస్తోంది. పెను తుఫాన్‌గా ఆవిర్భవించిన అనంతరం ఏపీ-ఒడిశా తీర ప్రాంతం వైపు దూసుకొస్తోంది. దీని ప్రభావంతో ఏపీ తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే ఏపీ దక్షిణ తీర ప్రాంత జిల్లాలు ప్రకాశం, నెల్లూరుల్లో వర్షం పడుతోంది. ఇదే పరిస్థితి కృష్ణా, ఉభయగోదావరి, గుంటూరు జిల్లాల్లోనూ కనిపిస్తోంది. అటు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలపై తుఫాన్ ప్రభావం అధికంగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తోన్నారు. ఒడిశాలోని గజపతి, కటక్, భువనేశ్వర్, పూరీ జిల్లాలపై అసానీ ఎఫెక్ట్ తీవ్రంగా ఉంది. తుపాన్‌కు సంబంధించి మినిట్ టు మినిట్ అప్‌డేట్స్ మీకోసం..

Asani Cyclone Live Tracking in Telugu: Know Current Location, Speed, Path, Landfall, Latest News Updates

Newest First Oldest First
5:39 PM, 12 May

ఏపీలో కొనసాగుతోన్న వర్షాలు
2:11 PM, 12 May
ఆంధ్రప్రదేశ్

అసని తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాల వల్ల పలు జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి. చేతికి అందిన పంట నీటి పాలైంది.
12:24 PM, 12 May

అసని తుఫాన్ బలహీనపడినప్పటికీ కొనసాగుతున్న దాని తీవ్రత. కడప, ప్రకాశం, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో మధ్యాహ్నం తరువాత కూడా పడుతున్న వర్షం.
12:02 PM, 12 May
ఆంధ్రప్రదేశ్

రుతు పవనాలు ప్రవేశించడానికి ముందే ఏపీలో భారీ వర్షాలకు కారణమైన అసని తుఫాన్. 1960 నుంచి ఇప్పటివరకు ఆరుసార్లు మాత్రమే ప్రీ మాన్‌సూన్ సైక్లోన్స్ ఏపీపై ప్రభావాన్ని చూపాయి.
11:24 AM, 12 May
ఆంధ్రప్రదేశ్

మరింత బలహీనపడ్డ అసని తుఫాన్. ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరం మీదుగా కదులుతున్నట్లు వెల్లడించిన వాతావరణ కేంద్రం. ఈ మూడు రాష్ట్రాల తీర ప్రాంతాల్లో ఇంకొన్ని గంటల పాటు వర్షం పడుతుందని అంచనా
10:50 AM, 12 May
ఆంధ్రప్రదేశ్

అసని తుఫాన్ ప్రభావానికి కాకినాడ-ఉప్పాడ రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. ఫలితంగా వాహనాల రాకపోకలను నిలిపివేత. త్వరలోనే మరమ్మతు పనులు చేపడతామని, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని వివరించిన పోలీసులు.
8:30 AM, 12 May
ఆంధ్రప్రదేశ్

కోస్తా తీరంపై తీవ్ర అల్పపీడనం గత ఆరు గంటలుగా స్థిరంగా ఉంది. అక్కడే అది బలహీనపడుతుందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. 12 గంటల సమయంలో మరింత బలహీనపడుతుందని పేర్కొంది.
7:44 AM, 12 May
ఆంధ్రప్రదేశ్

అసని తుఫాన్ బలహీనపడిన తరువాత కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కడప, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, బాపట్ల జిల్లాల్లో వర్ష తీవ్రత తగ్గట్లేదు.
7:29 AM, 12 May
ఆంధ్రప్రదేశ్

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయ, పునరావాస చర్యలను చేపట్టిన జాతీయ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ బలగాలు.
6:24 AM, 12 May
ఆంధ్రప్రదేశ్

కృత్తివెన్ను వద్ద తీరాన్ని తాకిన తరువాత బలహీనపడ్డ అసని తుఫాన్. ఆరు గంటల వరకు దాని ప్రభావం ఉంటుందని అంచనా వేసిన వాతావరణ కేంద్రం. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కొనసాగుతాయని వెల్లడి
11:24 PM, 11 May

మచిలీపట్నం నుంచి 21 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం బుధవారం అర్ధరాత్రి మరింత బలహీనపడి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
11:23 PM, 11 May

ఏపీకి తుఫాను పెనుముప్పు తప్పినట్లే. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాను కృష్ణా జిల్లా కృత్తివెన్ను సమీపంలో తీరాన్ని దాటింది. ఇక్కడ భూభాగాన్ని తాకిన అనంతరం బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారినట్లు భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఇది ఈశాన్య దిశగా కదులుతున్నట్లు తెలిపారు.
10:30 PM, 11 May

అసని తుఫాన్ నిన్నటి తో పోలిస్తే ఇవాళ కాస్త నెమ్మదించింది. గంటకు కేవలం 6 కిలోమీటర్ల వేగంతో కదులుతూ కాకినాడ నుంచి బాపట్ల వరకూ వచ్చింది. అక్కడి నుంచి తిరిగి బందరు వైపుకు మళ్లింది. ఆ మధ్యలోనే తీరాన్ని తాకింది
9:03 PM, 11 May

ప్రస్తుతం మచిలీపట్నంకు 40 కి.మీ., నరసాపురంకు 50 కి.మీ., కాకినాడకు 130 కి.మీ., విశాఖపట్నంకు 270 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది తుఫాను.
9:02 PM, 11 May

నెమ్మదిగా కదులుతున్న అసని తుపాను.
8:06 PM, 11 May

తుపాను తీవ్రతను దృష్టిలో ఉంచుకొని కాకినాడ-ఉప్పాడ బీచ్‌ రోడ్డులోకి సందర్శకులు రాకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి గస్తీ పెట్టారు.
8:05 PM, 11 May

అసని తుపాను ధాటికి కాకినాడ-ఉప్పాడ బీచ్‌ రహదారి పూర్తిగా ధ్వంసమైంది.
8:03 PM, 11 May

అసని తుపాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
6:43 PM, 11 May

ఏపీ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులకు అనేక చెట్లు విరిగిపడ్డాయి.
5:45 PM, 11 May

మళ్లీ దిశ మార్చుకున్న అసని తుపాను. అంతర్వేది వైపు కదులుతోన్న తుపాను
5:43 PM, 11 May

అసని ఎఫెక్ట్‌తో తెలంగాణలోనూ కురుస్తున్న వర్షాలు
4:51 PM, 11 May

విశాఖ కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ 1800 425 00002కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు: 0891-2590100, 2590102, 2560820
4:51 PM, 11 May

తీవ్ర తుపాను దృష్ట్యా అప్రమత్తమైన వివిధ శాఖల సిబ్బంది.ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్, నేవీ, కోస్ట్‌గార్డు బృందాలు సిద్ధం
4:50 PM, 11 May

తుపాను ప్రభావిత మండలాలకు ప్రత్యేక అధికారులుగా డిప్యూటీ కలెక్టర్లులోతట్టు ప్రాంతాల్లో తుపాను సమాచారాన్ని మైకుల ద్వారా తెలియజేస్తున్న సిబ్బంది
3:02 PM, 11 May
ఆంధ్రప్రదేశ్

తుపాన్ ప్ర‌భావిత ప్రాంతాల‌కు నిధులను మంజూరు చేశామని, పరిహారం ఇచ్చే విషయంలో ఎలాంటి జాప్యం చేయకూడదంటూ వైఎస్ జగన్ ఆదేశం. సెంట్రల్‌ హెల్ప్‌ లైన్‌తో పాటు, జిల్లాల వారీగా అందుబాటులోకి తీసుకుని హెల్ప్‌లైన్‌ నంబర్లను వినియోగించుకోవాలని, బాధితులను ఆదుకోవాలంటూ సూచన
2:55 PM, 11 May
ఆంధ్రప్రదేశ్

అసని తుఫాన్ పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష. పునరావాస శిబిరాలకు తరలించిన వారికి 2,000 చొప్పున ఆర్థిక సాయం అందించాల‌ని ఆదేశం. పునరావాస శిబిరాల్లో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని సూచన
2:05 PM, 11 May
ఆంధ్రప్రదేశ్

కొన్ని గంటల్లో కొనసీమ అంతర్వేది వద్ద అసని తుఫాన్ తీరాన్ని తాకుతుందని అంచనా వేసిన విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద. మళ్లీ సాయంత్రానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి చేరుకుంటుందని పేర్కొన్న డైరెక్టర్
1:50 PM, 11 May
ఆంధ్రప్రదేశ్

ప్రస్తుతం మచిలీపట్నానికి 40, కాకినాడకు 140 , విశాఖపట్నానికి 280 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది అసాని తుఫాన్. ఆరు గంటల వ్యవధిలో ఆరు కి.మీ వేగంతో పశ్చిమ-వాయవ్య దిశగా కదిలినట్లు వెల్లడించిన విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద
1:21 PM, 11 May
ఆంధ్రప్రదేశ్

అసని తుఫాను ప్రభావంతో కడప జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు. కడప, జమ్మలమడుగు, మైదుకూరు, ప్రొద్దుటూరు, బద్వేలుల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం. పొంగిపొర్లుతున్న కాలువలు. రోడ్ల పైకి వర్షపు నీరు చేరడంతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులు.
12:46 PM, 11 May
ఆంధ్రప్రదేశ్

అసని తుఫాన్ ధాటికి పార్వతిపురం మన్యం జిల్లాలో నేలకూలిన చెట్లు. రహదారిపై స్తంభించిన వాహనాల రాకపోకలు. యుద్ధ ప్రాతిపదికన వాటిని తొలగిస్తోన్న సిబ్బంది.
READ MORE

English summary
Asani Cyclone Live Tracking in Telugu: Know Current Location, Speed, Path, Landfall, Latest News Updates
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X