చేయకుంటే మళ్లీ ఓట్లడగనన్న కెసిఆర్: బాబుకు చురక
మహబూబ్‌నగర్: గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా అర్హులకే ప్రభుత్వ పింఛన్లు అందేలా చూస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు. ఆయన శనివారం మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరులో ఆసరా పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఆయన పింఛన్లు స్వయంగా అందజేశారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వృద్ధులు, వితంతువులకు రూ. 1000, వికలాంగులకు రూ. 1500ల పింఛన్లు ఇస్తున్నామని కెసిఆర్ చెప్పారు. ఈ పథకాన్ని పాలమూరు జిల్లా నుంచే ప్రారంభించినట్లు తెలిపారు. గత ప్రభుత్వాలు వితంతువులు, వృద్ధులకు రూ. 200 ఇచ్చాయని తాము దాన్ని వెయ్యి రూపాయలుగా చేశామని చెప్పారు. కొందరు దుర్మార్గులు పాత పింఛన్లు తీసేస్తారని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
గత ప్రభుత్వాలు విచ్చలవిడగా అనర్హుల పేర్ల మీద పింఛన్లు ఇచ్చాయని, 30ఏళ్ల వారికి కూడా పింఛన్లు ఇచ్చి దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. తమ ప్రభుత్వంలో ఒక్క పేదవాడ్ని, అర్హులను విడిచిపెట్టకుండా పింఛన్లు అందిస్తామని చెప్పారు. అనర్హులకు పింఛన్లు దక్కకుండా చేస్తామని చెప్పారు. ఒక వేళ పింఛను అర్హులకు ఎవరికైనా రాకుంటే వారు దరఖాస్తు చేసుకోవాలని, వాటిని పరిశీలించి వెంటనే పింఛను మంజూరు చేస్తామని కెసిఆర్ తెలిపారు.

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రూ. 75, కాంగ్రెస్ హయాంలో రూ. 200 పింఛను ఇచ్చారని, దాన్ని తమ ప్రభుత్వం 1000 రూపాయలకు పెంచిందని చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.4వేల కోట్లు ఖర్చు చేస్తోందని కెసిఆర్ తెలిపారు. రెండుపుటలా అన్నం తినాలనే పింఛన్ మొత్తాన్ని పెంచినట్లు ఆయన చెప్పారు.
త్వరలో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ఆయన తెలిపారు.ప్రస్తుతం తెలంగాణ విద్యుత్ సమస్య ఉందని, ఇటీవలే ఛత్తీస్‌గఢ్ నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ను కొనగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. రాష్ట్రానికి ఈ విద్యుత్ వచ్చేందుకు ఏడాది పడుతుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో మూడేళ్లు పూర్తయ్యే సరికి ఒక్క సెకను కూడా విద్యుత్ పోనివ్వమని కెసిఆర్ తెలిపారు.
రూ. 30వేల కోట్ల మంచినీటి పథకాన్ని ప్రభుత్వం చేపడుతోందని కెసిఆర్ చెప్పారు. ఇప్పటికే రూ. 110 కోట్లను సర్వే కోసం వెచ్చించామని చెప్పారు. సర్వే తర్వాత డ్రింకింగ్ వాటర్ గ్రిడ్‌కు శంకుస్థాపన చేస్తామని అన్నారు. ఐదేళ్లలోపు తెలంగాణలోని ప్రతీ ఇంటికీ, పల్లెకూ, తాండాకు నల్లా ఇచ్చే బాధ్యత తనదని కెసిఆర్ చెప్పారు. ఈ కాలంలో నీళ్లు ఇవ్వకుంటే తాము ప్రజలను ఓట్లు అడగమని చెప్పారు. అందరి సహకారంతో ఆకుపచ్చ, చిరునవ్వుగల తెలంగాణను తీర్చిదిద్దుతామని అన్నారు.
ప్రతి మనిషికి 6కిలోల బియ్యాన్ని, ఒక్క రూపాయికే కిలో చొప్పున అందిస్తామని చెప్పారు. కుంటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి 6 కిలోల చొప్పున అందజేస్తామని చెప్పారు. గత ప్రభుత్వాలు కుటుంబంలో ఎంతమంది ఉన్నా 20కిలోలే అందించాయని అన్నారు.
పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని 15రోజుల్లో ప్రారంభిస్తామని సిఎం కెసిఆర్ చెప్పారు. ఈ పథకంతో మహబూబ్‌నగర్ జిల్లాతోపాటు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు నీరు అందుతుందని తెలిపారు. తాను మహబూబ్‌నగర్ ఎంపీగా ఉన్న సమయంలో జిల్లా అంతా తిరిగానని చెప్పారు. జిల్లాలోని ఆర్అండ్‌బి కింద 3,400 కి.మీ, 10,381 కిలోమీటర్ల రోడ్ల పరిస్థితిని గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆరోపించారు.
జిల్లాలో 5 వేల కి.మీ రోడ్లను పునరుద్ధరిస్తామని కెసిఆర్ చెప్పారు. గుంతలు లేకుండా అద్దల్లా తయారు చేస్తామని చెప్పారు. ఆర్ అండ్ బి కింద 1,800 కి.మీ రోడ్లను పునరుద్ధరిస్తామని, కొత్త రోడ్లు కూడా నిర్మిస్తామని చెప్పారు. 20వేల కి.మీ మట్టిరోడ్లను 600కోట్లు ఖర్చు చేసి పునరుద్ధరిస్తామని చెప్పారు.
పాలమూరు జిల్లాలోని 7,480చెరువులను ఆంధ్రా ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆరోపించారు.
1,496 చెరువులకు టెండరు వేస్తున్నామని, స్థానిక ఎమ్మెల్యేలు, నాయకులు వీటిని పర్యవేక్షించాలని చెప్పారు. రాష్ట్రంలో ఏడాదికి 9వేల చెరువుల చొప్పున పునరుద్దరిస్తామని చెప్పారు. కొత్తూరు ప్రాంతంలోని యువతకు పరిశ్రమల్లో ఉపాధి లభించేలా చూస్తామని చెప్పారు. దీనిపై ఎంపి జితేందర్ రెడ్డి, అంజయ్య తన దృష్టికి తెచ్చారని చెప్పారు.
చంద్రబాబుకు చురక
తనను చంపిన అబద్దాలు చెప్పనని సిఎం కెసిఆర్ అన్నారు. చాలా మంది రాజకీయ నాయకులు గోల్‌మాల్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. తాము రైతుల రుణాలు మాఫీ చేస్తామన్నాం, చేశామని ఆయన చెప్పారు. అయితే ఏపి సిఎం చంద్రబాబు రైతుల రుణాలు, డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని చెప్పి.. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు.
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్‌లోని క్రేన్‌కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications