పర్వతాన్ని ఎక్కుతుండగా ప్రమాదం: అమెరికాలో ఏపీ యువకుడు మృతి
న్యూజెర్సీ: అమెరికాలో పర్వతం పైనుంచి జారిపడి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు మృతి చెందాడు. అమెరికాలోని ప్రఖ్యాత పర్వతాన్ని అధిరోహించే ప్రయత్నంలో ఆశిష్ పెనుగొండ(29) మరణించారు.
న్యూయార్క్‌లో నివసించే ఆశిష్ ఓ స్నేహితుడితో కలిసి కాలిఫోర్నియాలోని యోస్‌మైట్ జాతీయ ఉద్యానవనానికి వెళ్లారు. అక్కడ నునుపైన హాఫ్‌డోమ్‌పర్వతాన్ని అధిరోహించాలని ప్రయత్నించారు.

తాళ్ల సాయంతో పైకి ఎక్కుతుండగా ఒక్కసారిగా ఆశిష్ జారిపోయారు. అనంతరం కిందపడి మరణించారు. ఆయన మృతదేహాన్ని గత మంగళవారం అధికారులు వెలికితీశారు. ఫెయిర్‌లే డికిన్సన్ వర్సిటీలో చదువుకున్న ఆశిష్.. సీమెన్స్ హెల్త్‌కేర్‌లో బయోకెమిస్ట్‌గా పనిచేసేవారు.
ఆశీష్ మృతదేహాన్ని స్వస్థలానికి తరలించడంతోపాటు, కుటుంబానికి సాయం అందించేందుకు ఆయన స్నేహితులు 'గో ఫండ్ మీ' వెబ్‌సైట్‌లో నిధుల సేకరణ చేపడుతున్నారు. ఆశీష్ మరణ వార్త తెలుసుకున్న ఆయన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.












Click it and Unblock the Notifications