ముఖ్యమంత్రి భయపెట్టగలరా?: జగన్‌కు అశోక్ కౌంటర్

Ashok Babu
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తమను భయపెట్టి సమ్మె విరమింప చేశారనడం సరికాదని, ఆయన తమను భయపెట్టగలరా అని ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు సోమవారం అన్నారు. ఎపిఎన్జీవోలను ముఖ్యమంత్రి భయపెట్టే స్థాయిలో ఉన్నారని తాము భావించడం లేదన్నారు. ఉద్యోగులను సంఘాల వారీగా పిలిపించుకుని భయపెట్టి, వారిని సమ్మె నుంచి విరమింపచేశారని ముఖ్యమంత్రిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సమైక్య శంఖారావం సభలో ఆరోపించిన నేపథ్యంలో అశోక్ స్పందించారు.

ముఖ్యమంత్రికి తమను భయపెట్టే స్థాయి ఉందా? ఇంతటి ఉద్యమాన్ని భయపట్టే స్థాయి దేశంలో ఏ ప్రభుత్వానికి కూడా ఉండదన్నారు. తెలంగాణ ప్రాంత ఉద్యోగులు సకల జనుల సమ్మెను ఎలా విరమించారో? మేమూ అలానే చేశామన్నారు. అయినా తమ సమ్మెకు విరామం మాత్రమే ప్రకటించామని, అసెంబ్లీకి బిల్లు వచ్చినప్పుడు మళ్లీ సమ్మె చేపడతామన్నారు.

సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో మూడు నెలలుగా ఐకాస పెద్దగా నిర్ణయాలు తీసుకోలేదని, సోమవారం నాటి సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై విస్తృతంగా చర్చించి, పలు నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ఉద్యోగులకు 50 శాతం మధ్యంతర భృతిని ఇవ్వాలని, జీవో 177ను రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్లతో మంగళ లేదా బుధవారాల్లో ఐకాస బృందం ముఖ్యమంత్రిని కలవనుందన్నారు.

వేతన సవరణ సంఘం(పిఆర్‌సి) చర్చల ప్రక్రియను నవంబర్ 15 నాటికి ముగించాలని, తదుపరి ఒక నెలల్లోనే పిఆర్‌సి తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య కార్డులను వెంటనే జారీచేసి, దీనిపై తుది ఉత్తర్వులు వెలువరించడానికి ముందే ఉద్యోగ సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటుచేసి, అభిప్రాయాలను సేకరించాలని త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతిని కలిసి కోరతామన్నారు. పిఆర్‌సిలో ఫిట్‌మెంట్‌ను 69 శాతంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+