రాజీనామాలు చేస్తేనే: అశోక్ బాబు హెచ్చరిక

విభజనను సమర్థించే వారికి రాజకీయ భవిష్యత్ ఉండదని హెచ్చరించారు.రాయలసీమ అభివృద్ధికి కేంద్ర చేయూతనివ్వాలని కోరారు. ప్రజలతో కలిసి ఉద్యమంలోకి రాకపోతే రాజకీయ నాయకుల భవిష్యత్ కు శుభం కార్డు పడుతుందన్నారు. సమైక్యాంధ్రలోనే 2014 ఎన్నికలు జరుగుతాయని తేల్చిచెప్పారు. కేబినేట్ నోట్ తిరస్కరించి కేంద్ర మంత్రులు బయటకు రావాలన్నారు.
ఈనెల 24న కొంత మంది సీమాంధ్ర ఎంపీల రాజీనామాలతో కాంగ్రెస్‌పై మరింత ఒత్తిడి పెరుగుతుందని అశోక్‌బాబు అన్నారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. యుపిఎ ప్రభుత్వమే సంక్షోభంలో ఉన్నప్పుడు తెలంగాణ నోట్ ఎలా ప్రవేశపెడతారని ఆయన ప్రశ్నించారు. రాయలసీమ అభివృద్ధికి కేంద్ర చేయూత ఇవ్వాలని ఆయన కోరారు.
సమైక్యాంధ్ర ఉద్యమ సెగ కాంగ్రెసు అధిష్టానాన్ని తాకాలంటే సీమాంధ్ర ప్రజలంతా ఢిల్లీ వేదికగా ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని మంత్రులు ఏరాసు ప్రతాప రెడ్డి, టిజి వెంకటేష్ అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి ఢిల్లీ బయలుదేరిన వారు సోమవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు అధిష్టానం తెలంగాణ ప్రక్రియను ముందుకు తీసుకుని వెళ్తే అసెంబ్లీలో తెలంగాణ బిల్లును ఓడిస్తామని వారు చెప్పారు.












Click it and Unblock the Notifications