టిపై కోర్టుకు, తమిళపార్టీల నేతల్ని కలుస్తాం: అశోక్‌బాబు
హైదరాబాద్: తెలంగాణపై అవసరమైతే తాము న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు శుక్రవారం చెప్పారు. తాము అరవై రోజులుగా ఉద్యమం చేస్తున్నామని, ఆర్టీసి, రెవెన్యూ ఉద్యోగులు సమ్మెలోనే ఉన్నారని చెప్పారు. విద్యుత్ ఉద్యోగులు పరిస్థితుల నేపథ్యంలో తాత్కాలికంగా సమ్మెను వాయిదా వేశారన్నారు. అవసమైనప్పుడు వారు సమ్మె బాట పడతారని తెలిపారు.
ఈ నెల 13, 15, 15 తేదీల్లో ఏదో ఒక రోజు తమిళనాడులో అధికార అన్నాడిఎంకె, ప్రతిపక్ష డిఎంకె పార్టీల నాయకులను కలుస్తామని, ఆంధ్రప్రదేశ్ సమైక్యత కోసం తమకు మద్దతివ్వాలని కోరుతామని తెలిపారు. ఈ నెల 17, 18, 19 తేదీల్లో కేంద్ర కార్యాలయాలను ముట్టడిస్తామన్నారు.

తెలంగాణ కోసం 371(డి) ఆర్టికల్ తీసుకు వచ్చే హక్కు కేంద్రానికి లేదన్నారు. అవసరమైతే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు న్యాయస్థానానికి వెళ్తామన్నారు. తెలంగాణపై వేసిన మంత్రుల బృందం లోపభూయిష్టంగా ఉందన్నారు.
అసెంబ్లీలో రాష్ట్ర విభజనను సీమాంధ్ర ప్రజాప్రతినిధులు అందరూ వ్యతిరేకించాలని అశోక్ బాబు డిమాండ్ చేశారు. ఆర్టీసి ఉద్యోగుల సమ్మె కొనసాగుతోందన్నారు. ఈ నెల 16న రైతు సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు.
కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే, ఎపి వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్‌ల ప్రకటనలు రాష్ట్ర ప్రజలను గందరగోళపరుస్తున్నాయని మండిపడ్డారు. సమ్మెను తాము యథాతథంగా కొనసాగిస్తామన్నారు.
సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు
తన హయాంలో విభజన జరగదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారని ఆయన విజ్ఞప్తిని గౌరవించి తాత్కాలికంగా సమ్మె విరమిస్తున్నట్లు సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఐక్యకార్యాచరణ సమితి ప్రకటించింది.












Click it and Unblock the Notifications